ప్రేమ మొదలై నేటికి మూడేళ్లు

Tue Jul 20 2021 20:00:02 GMT+0530 (IST)

Its been three years since love began

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వరుస చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లతో హాలీవుడ్ లో దూసుకు పోతుంది. ఒక వైపు బాలీవుడ్ సినిమాలు చేస్తూ మరో వైపు హాలీవుడ్ లో ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు మూడు సంవత్సరాల క్రితం అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా గుర్తింపు దక్కించుకుంది. నిక్ జోనస్ బ్రాండ్ ఇమేజ్ తో ఆమె కూడా మరింత పాపులర్ అయ్యింది అనడంలో సందేహం లేదు. వీరి పెళ్లి సమయంలో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేసినా కూడా ఇద్దరు మాత్రం చాలా ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు.నేడు ప్రత్యేకమైన రోజుగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది. నేడు తమ ఇద్దరి మద్య ప్రేమ పుట్టిందని.. సరిగ్గా ఈ రోజున తమ ప్రేమను వ్యక్త పర్చుకున్నట్లుగా ఆమె ఆనందంతో ఆ సందర్బంను గుర్తు చేసుకున్నారు. మూడు సంవత్సరాల కాలం రెప్ప పాటులో పూర్తి అయినట్లుగా అనిపిస్తుంది ఐ లవ్ యూ అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టింది. నిక్ కూడా నేటికి మూడు సంవత్సరాలు అంటూ పోస్ట్ పెట్టాడు. వీరిద్దరు లవ్ యానివర్శరీ కూడా జరుపుకోవడం కొత్తగా ఉందని.. మీ ఇద్దరి మద్య ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. మరో వైపు వీరి ప్రేమను అప్పట్లో అవమానించిన వారు అనుమానించిన వారు ఏమయ్యారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నాను. ప్రియాంక చోప్రా కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు. దాంతో ఇద్దరి మద్య ఒకటి రెండేళ్ల కంటే ప్రేమ బంధం కొనసాగదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం తన మార్కెట్ ను పెంచుకోవడం కోసం ప్రియాంక చోప్రా అతడిని పెళ్లి చేసుకుంటుంది అని కామెంట్స్ చేసిన వారు కూడా చాలా మందే. అయినా కూడా ఇద్దరు ప్రేమతో ముందుకు సాగారు. మూడు ఏళ్లు అయినా కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు.