కొడుకు ఎఫైర్లు ప్రొడ్యూసర్ ఆవేదన!

Mon Feb 17 2020 12:30:00 GMT+0530 (IST)

It's Badluck - Boney Kapoor

పరిశ్రమలో ఎఫైర్లు సత్సంబంధాల్ని దెబ్బ కొడతాయి. ఒక రకంగా వ్యాపార అవకాశాల్ని ఒక్కరోజులో స్మాష్ చేసేస్తాయి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - బోనీకపూర్ మధ్య ప్రస్తుత సన్నివేశం తెలిసిందే. పుత్రరత్నం అర్జున్ కపూర్ ఎఫైర్ బోనీని విలవిలలాడేలా చేసింది. అతడు ఏకంగా సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ భార్యతో ఎఫైర్ పెట్టుకోవడం ఇండస్ట్రీలో ప్రముఖంగా చర్చకు వచ్చింది. అది సల్మాన్ తో బోనీ సినిమాలు నిర్మించే అవకాశాన్ని పోగొట్టింది.సల్మాన్ కుటుంబంలోని మలైకా అరోరాఖాన్ తో బోనీ వారసుడు అర్జున్ కపూర్ ఎఫైర్ సాగించడంపై బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వేడెక్కించాయి. ఆ క్రమంలోనే తన కొడుకు నిర్వాకానికి బోనీకపూర్ ఎంతో బాధపడుతున్నారని మీడియా వెల్లడించింది. ఓవైపు తనయుడిపై పుత్రవాత్సల్యాన్ని పోగొట్టుకోలేడు. అలాగని నిర్మాతగా తనకు సల్మాన్ తో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేడు. ఆ రెండిటి నడుమా ఆయన చాలా నరక యాతన అనుభవించాడు. తనకంటే వయసులో ఎంతో పెద్దది అయినా మలైకాని విడిచి అర్జున్ క్షణమైనా ఉండలేడు. తాను వారించినా వినకుండా ఎఫైర్ సాగించాడు. ఇది బోనీకి పెద్ద సెట్ బ్యాక్. సల్మాన్ తో పూర్తిగా సత్సంబంధాలు తెగిపోవడానికి కారణమైంది. ఈ విషయంపైనా బాలీవుడ్ మీడియాలో బలమైన కథనాలొచ్చాయి. హీరోగా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న అర్జున్ కపూర్ కెరీర్ కి ఇలాంటివి మంచిది కాదని బోనీ వారించినా అతడు వినలేదని కథనాలొచ్చాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీకపూర్ ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్ వల్లనే అర్జున్ కపూర్ హీరో అయ్యాడని.. అది భాయ్ ప్రోత్సాహం వల్లనే కుదిరిందని తెలిపారు. వాస్తవానికి అర్జున్ కపూర్ హీరో అవ్వాలనుకోలేదు. దర్శకుడు కావాలని కోరుకునేవాడు. అందుకే కొత్త హీరోలాగే అతన్ని లాంచ్ చేసే ఆలోచన నాకు లేదు అని బోనీ తెలిపారు. ఒకరోజు సల్మాన్ నుండి నాకు కాల్ వచ్చింది. నటనలో ఎదిగేందుకు అర్జున్ లో క్వాలిటీస్ ఉన్నాయి అని అన్నారు. సల్మాన్ బాధ్యత తీసుకుని హీరోని చేశాడు అని వెల్లడించారు. ``దురదృష్టవశాత్తు.. సల్మాన్ తో నాకున్న సంబంధం ఇప్పుడు దెబ్బతింది. కాని మొదట్లో సల్మాన్ అర్జున్ ను నటనలోకి రమ్మని ప్రోత్సహించాడు. నేను సల్మాన్‌కు రుణపడి ఉంటాను`` అంటూ ఒకరకంగా ఆవేదనను వ్యక్తం చేశారు.