కొత్త తరహా ఐటెం సాంగ్ ను పరిచయం చేయబోతున్నాడట

Thu Apr 22 2021 11:00:01 GMT+0530 (IST)

Item Song In Mahasamudram

టాలీవుడ్ లో ప్రస్తుతం మాస్ సినిమా అంటే ఖచ్చితంగా ఐటెం సాంగ్ తప్పనిసరి అయ్యింది. ఐటెం సాంగ్ లేనిది ఆ సినిమా మాస్ సినిమా అనిపించుకోదు అనే అభిప్రాయం అందరిలో వచ్చింది. అంతటి బలమైన ఐటెం సాంగ్ విషయంలో దర్శకుడు అజయ్ భూపతి ప్రయోగం చేస్తున్నాడు. సాదారణంగా ఐటెం సాంగ్ అంటే స్టార్ హీరోయిన్ లను ఎంపిక చేస్తున్నారు. తన మహాసముద్రం సినిమాలో దర్శకుడు అజయ్ భూపతి ఈ విభిన్నమైన ఐటెం సాంగ్ ను పెట్టబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ ఐటెం సాంగ్ లో సీనియర్ హీరోయిన్ రంభ పై ఉంటుందట. ఈ ఐటెం సాంగ్ రంభ పై చిత్రీకరించబోతున్నారు. కాని ఇందులో రంభ ఉండదట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రంభ కటౌట్ లను ఉపయోగించి ఈ ఐటెం సాంగ్ ను చూపిస్తారని అంటున్నారు. ఈ ఐటెం సాంగ్ వెనుక చాలా ప్రత్యేకమైన నేపథ్యం ఉంటుందట. జగపతి బాబు మరియు శర్వానంద్ లు కలిసి ఈ పాటలో రంభ కటౌట్ తో స్టెప్పులు వేస్తారని తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహాసముద్రంలో జగపతిబాబు హీరోయిన్ రంభ కు వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. అందుకే ఆమె కటౌట్ తో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా లో శర్వానంద్ మరియు సిద్దార్థలు నటిస్తుండగా అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి చేస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా రూపొందుతున్న ఈ సినిమా లోని ఐటెం సాంగ్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ను కలుగజేస్తుందని అంటున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. మరి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విడుదల తేదీ విషయంలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.