రాజు గారి గది లో రచ్చ చేస్తున్న ఐటెం భామలు

Mon Oct 14 2019 12:31:59 GMT+0530 (IST)

యాంకర్ నుండి తన కష్టంతో డైరెక్టర్ గా మారాడు ఓంకార్. అతను ఇప్పటివరకు తెలుగులో 3 సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు నాల్గవ సినిమా 'రాజుగారి గది 3' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పక్కా మాస్ బీట్స్ తో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకుల కోసం అని చెప్పక్కర్లేదు. అతను చేసిన నాలుగు సినిమాలలో 'జీనియస్' మూవీ తప్ప అన్ని సినిమాలు హర్రర్ సినిమాలే.ఓంకార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'జీనియస్'. ఆ సినిమాలో 'డిబిరి డిబిరి' అనే ఐటెం సాంగ్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ ఆ రేంజ్ లో ఇప్పుడు విడుదల చేసిన లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. 'నా గది లోకి రా' అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపడం ఖాయం. ఇదివరకు ఐటెం సాంగ్ అంటే సిల్క్ స్మిత లాంటి వాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు ఐటెం సాంగ్ లు అన్నీ మన స్టార్ హీరోయిన్స్ చేసేస్తున్నారు. ఆ ఐటెం సాంగ్స్ లో హీరోయిన్లను చూస్తున్న జనాలకు అది ఐటెం సాంగ్ లా అనిపించట్లేదు. అది కూడా రొటీన్ సాంగ్ లానే చూస్తున్నారు. ఇప్పుడు ఒక మంచి ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ టైములో ఓంకార్ విడుదల చేసిన లిరికల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఈ మధ్య కాలంలో 'రంగమ్మ మంగమ్మ' పాటతో ఆకట్టుకున్న మానసి ఈ పాట పాడింది. ఆమెకు జత కలిసాడు స్టార్ సింగర్ రేవంత్.

ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఆయన కొరియోగ్రఫి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన కొరియోగ్రఫి చేసిన మాస్ పాటలు ఆ సినిమాలలోనే పెద్ద హిట్ అయ్యాయి. ఈ పాటలో ఆలీ ధనరాజ్ లాంటి కమెడియన్స్ కూడా కనిపిస్తున్నారు.