రాజ్ కుంద్రా-శిల్పాషెట్టి ఆస్తులు తెలిస్తే షాకే

Fri Jul 23 2021 09:00:01 GMT+0530 (IST)

shocking to know the assets of Raj Kundra Shilpa Shetty

అశ్లీల వీడియో తీసిన కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి శిల్పాషెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు మీడియాలో మొత్తం వీరి గురించే చర్చించుకుంటున్నారు. తాజాగా ఆయనకు కళ్లు చెదిరే ఆస్తులున్నాయని.. భారీగా పోగేశారని అంటున్నారు. ఇవన్నీ ఈ అశ్లీల వీడియోల ద్వారానే సంపాదించాడని అంటున్నారు.రియాలిటీషోలు వివిధ ప్రోగ్రాంలలోపాల్గొంటున్న శిల్సాషెట్టి బుల్లితెరపై భారీగానే సంపాదిస్తోందట.. ఇక ఆమె భర్త రాజ్ కుంద్రాది మొదటి నుంచి వ్యాపార కుటుంబమే.. వీరి పెళ్లి తర్వాత ఇంకా భారీగా ఇద్దరూ కలిసి ఆస్తులు కూడబెట్టినట్టు తెలిసింది.

ప్రాథమికంగా చూస్తే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వీరికి భారీ ఆస్తులు.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అంటున్నారు. ముంబైలోని జుహూ ఏరియాలో రాజ్ కుంద్రా-శిల్పాలకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. ఇక్కడే వీరు జీవిస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

ఇక ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో కూడా వీరికి ఓ ఫ్లాట్ ఉండేదని.. అది సరిపోకపోవడంతో అమ్మేసినట్టు తెలిసింది.ఇక ఇంగ్లండ్ దేశంలోని సర్రేలో ఈ జంటకు అందమైన మాన్షన్ ఉందట.. వీరు హాలీడేస్ కోసం యూరప్ వెళ్లినప్పుడు ఇక్కడే స్టే చేసి మొత్తం అన్నీ చుట్టి వస్తారట..

ఇక వీరికి సొంతంగా ప్రైవేటు జెట్ ఉందని చెబుతున్నారు. ఎక్కడికెళ్లినా సొంత విమానంలో ప్రయాణం చేస్తారని సమాచారం. ఇక ఖరీదైన లాంబోర్గిని కార్లు బీఎండబ్ల్యూ సహా లగ్జరీ కార్లు వీరు కొని గ్యారేజ్ లో పెట్టుకుంటారట.. ఇక రాజ్ కుంద్రా గతంలో శిల్పా కు ఏకంగా 3 కోట్ల ఉంగరం కొనిచ్చాడట.. ఇలా లగ్జరీ లైఫ్ లో కావలసినంతగా వీరి సంపాదన ఉందంటే కోట్లు సంపాదిస్తున్నట్టే లెక్క. అదంతా ఎక్కడిదన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది.