ఇస్మార్ట్ ఐటమ్ బోయ్ అంటారేమో

Wed Dec 04 2019 21:28:24 GMT+0530 (IST)

Ismart Item Boy

ఐటమ్ నంబర్లు అంటే ప్రత్యేకించి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. మలైకా.. కత్రిన.. సన్నీలియోన్ .. ఆ లెవలుండాలి. కానీ ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో ఐటమ్ ల తీరు మారుతోంది. అక్కడ సల్మాన్ భాయ్ దబాంగ్ 3 కోసం తానే `మున్నా బదనాం హుయా ..` అంటూ ఐటెమ్ బోయ్ అవతారం ఎత్తాడు. అయితే అంత పెద్ద స్టార్ అలాంటి ప్రయత్నం చేయడం స్ఫూర్తి నింపింది. ఆ స్ఫూర్తితోనే ఇటు తెలుగు హీరోలు కూడా అంతో ఇంతో ప్రయత్నిస్తున్నారు.గతంలో వెంకీ.. ఎన్టీఆర్ ఈ తరహాలో స్పెషల్ నంబర్లలో ప్రయత్నించారు. అది కూడా తమ సన్నిహిత హీరోల కోసం. తాజాగా ఇస్మార్ట్ బోయ్ రామ్ అలాంటి రెక్వస్ట్ కి అంగీకరించాడట. పైగా తన కెరీర్ కి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చి హోప్ పెంచిన ది గ్రేట్ మాస్ డైరెక్టర్ పూరి కోసం ఇది అంగీకరించాడట. పూరి ప్రస్తుతం తనయుడు ఆకాష్ పూరి కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడు. మెహబూబా మిస్టేక్ ని తిరిగి రిపీట్ కానివ్వకుండా యూత్ ని థియేటర్లకు రప్పించేలా ఈసారి మసాలా అంశాలతో రంజింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. రొమాంటిక్ అన్న టైటిల్ కి తగ్గట్టే పూరి మార్క్ రొమాన్స్ ఈ చిత్రంలో వేడెక్కించబోతోందట.

దీనికి మరింత మసాలా అద్దేందుకు తాజాగా రామ్ ని ఐటమ్ బోయ్ గా పరిచయం చేయబోతున్నాడట. ఇందులో కథానాయికతో కలిసి రామ్ అదిరిపోయే ఐటమ్ లో నర్తిస్తాడని తెలుస్తోంది. రామ్ మరోసారి ఇస్మార్ట్ బోయ్ గా మారి ఇందులో ట్రీటిస్తాడంటే అది ఎనర్జిటిక్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే మ్యాటరే. మొత్తానికి ఆకాశ్ పూరికి రామ్ ఫ్యాన్స్ నుంచి బూస్ట్ అందబోతోందని భావించాలి. మెహబూబాలో ఆకాశ్ పూరి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కి పేరొచ్చింది. రొమాంటిక్ లో అంతకుమించిన ఎనర్జీతో అలరిస్తాడట.