ఫోటో స్టోరీ: అక్క రోబో అయితే చెల్లి 2.0!

Thu May 28 2020 18:00:41 GMT+0530 (IST)

Photo Story Isha Sharma Stunning Pose In White Dress

'చిరుత' ఫేమ్ నేహ శర్మ తెలుసు కదా.. ఆ నేహకు ఒక ఓ చెల్లి ఉంది. పేరు ఐష శర్మ.  తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ ఒకటీ అరా బాలీవుడ్ సినిమాల్లో నటించి 'హీరోయిన్' అయింది.  ఇక భామకు గ్లామరస్ గా ఉండడం.. సోషల్ మీడియాలో సామాజిక న్యాయం పాటిస్తూ ఫోటోలు అందరికీ కనిపించేలా షేర్ చెయ్యడం హాబీలు.అక్క చూపించిన కసరత్తుల బాటలో.. గ్లామరస్ హైవేలో పయనిస్తూ నెటిజన్లను థ్రిల్ చేస్తూ ఉంటుంది. ఈమధ 'ఫ*లాజీ' టైటిల్ తో కొన్ని ఫసాక్ క్యాప్షన్లు కూడా ఇస్తోంది.  రీసెంట్ గా ఐష అలానే ఒక క్యాప్షన్ ఇచ్చింది "ఈ లోకంలో మూడు మహామ్మారులను ఒకేసారి ఎదుర్కొంటున్న తరం మనదే.  టిక్ టాక్.. వెర్రితనం.. మహమ్మారి" అంటూ పోస్ట్ చేసింది.  ఇలాంటి పోస్టులు టిక్ టాక్ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయనే విషయం మర్చిపోయింది. సరే ఇవయితే మనోభావాలను దెబ్బతీస్తాయి కానీ గ్లామరస్ ఫోటోలు మాత్రం వారిలోని కళాపిపాసులను నిద్రలేపి తకధిమితోం.. తళాంగు తకఝుం అనిపిస్తాయి.

ఫోటోలో అమ్మడి నవ్వు.. అదోరకమైన హావభావ ఇంద్రజాలం.. అన్నీ కనిపిస్తున్నాయి కదా.  ఇలాంటి ఫోటోలకు డంగైపోతున్నారు కాబట్టే పాప ఇన్స్టా ఖాతాకు 1.6 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఇంతలా మాయ చేస్తున్న ఐషకు ఎందుకో ఫిలిం మేకర్లు మాత్రం పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు. ఎవరో ఒకరు ఆఫర్లు ఇచ్చేవరకూ ఐషకు విరామం లేదు.. విశ్రాంతి లేదు.