ఫోటో స్టోరి: బాత్ టబ్ లో తెలుగమ్మాయ్ సింగారం

Mon Feb 22 2021 22:00:01 GMT+0530 (IST)

Isha Rebba Latest Photo

టాలీవుడ్ సహా ఇరుగు పొరుగు భాషల్లోనూ కెరీర్ ని మలుచుకునేందుకు తాపత్రాయ పడుతోంది ఇషా రెబ్బా. ఈ తెలుగమ్మాయ్ సోషల్ మీడియాల వేదికగా కావాల్సినంత ప్రచారం దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఇన్ స్టా వేదికపై వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.సోషల్ మీడియాల్లో ఇషా ఇటీవల హద్దులు చెరిపేసి చెలరేగుతుండడంతో ఆ ఫోటోలన్నీ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకుముందే బ్లాక్ శారీలో సన్నజాజి సోయగాన్ని తలపించే లుక్ తో కనిపించింది. ఆ వీడియో జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యింది.

లేటెస్టుగా పసుపు రంగు నైట్ వేర్ లో కనిపించింది. బాత్ టబ్ లో డిజైనర్ లుక్ తో ఇషా హొయలు వేడెక్కిస్తున్నాయ్. హౌస్ ఆఫ్ సాచి ఔట్ ఫిట్ ఇది. అందానికి అందం హాట్ నెస్ ఈ అమ్మడి సొంతం. అందుకే ఈ ఫోటోని యూత్ వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఇషా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కి రావాల్సి ఉంది. తదుపరి పలు క్రేజీ చిత్రాల్లోనూ ఇషా కనిపించనుంది. తమిళంలోనూ ఈ భామ పెద్ద అవకాశాల్ని ఆశిస్తోందిట.