నటుడి ఆత్మహత్య.. వైరల్ అయిన సూసైడ్ నోట్

Wed May 22 2019 15:00:59 GMT+0530 (IST)

హాలీవుడ్ 'థోర్' మూవీ నటుడు ఐసాక్ కప్పీ ఆత్మహత్య చేసుకున్నాడు. నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు ఎంతో మంది అభిమానంను దక్కించుకున్న ఐసాక్ కప్పీ సోమవారం రాత్రి బ్రిడ్జ్ పై నుండి హైవే పై దూకేశాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక వాహనం ఐసాక్ ను ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఐసాక్ ఆత్మహత్య చేసుకోబోతున్న విషయం గమనించిన కొందరు ఆపేందుకు ప్రయత్నించినా కూడా సఫలం కాలేక పోయారు.ఆత్మహత్య చేసుకున్న ఐసాక్ సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నోట్ లో ఐసాక్ మానసిక క్షోభను అనుభవించినట్లుగా తెలియజేశాడు. గత కొన్ని రోజులుగా నాకు నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఇది నేను ఎప్పుడో చేసుకోవాల్సి ఉంది. నా గురించి నేను కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. నేను మంచివాడిని కాదు. నేను చేసిన తప్పులు చాలా మందిని బాధ పెట్టాయి. నా కుటుంబ సభ్యులను మరియు నన్ను ప్రేమించిన వారిని కూడా నేను బాధ పెట్టాను.

చాలా మందిని నేను డబ్బు కోసం వాడుకున్నాను. డ్రగ్స్ అమ్మడం ద్వారా ఎంతో మంది జీవితాలను నాశనం చేశాను. మద్య డ్రగ్స్ సిగరెట్లకు బానిసనైన నేను ఎక్కువగా గ్యాంబ్లిండ్ ఆడటంతో డబ్బులు పోగొట్టుకున్నాను. తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో నేనున్నాను. ఆర్థికంగా బాగా ఉన్న సమయంలో నేను ప్రభుత్వంకు చెల్లించాల్సిన పన్ను చెల్లించలేదు. దేవుడిని కూడా పలు సార్లు మోసగించాను. నేను చేసిన పాపాలకు నేను చేసిన నేరాలకు నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను. ఈ శిక్షతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరియు జీసెస్ కు క్షమాపణలు చెబుతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ ను ఐసాక్ కప్పీ చేశాడు.