Begin typing your search above and press return to search.

లవర్‌ బాయ్ కి బోల్డ్‌ రొమాన్స్‌ సెట్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   20 Jun 2021 4:30 AM GMT
లవర్‌ బాయ్ కి బోల్డ్‌ రొమాన్స్‌ సెట్‌ అయ్యేనా?
X
హ్యాపీ డేస్ తో హీరోగా పరిచయం అయ్యి లవర్ బాయ్ గా గుర్తింపు దక్కించుకున్న వరుణ్‌ సందేశ్‌ గత కొంత కాలంగా సినిమాల్లో ఆఫర్లు లేక దాదాపుగా కనుమరుగు అయ్యాడు అనుకుంటున్న సమయంలో బిగ్‌ బాస్ లో కనిపించాడు. బిగ్‌ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు. వరుణ్‌ సందేశ్‌ ఇప్పటికే 'ఇందువదన' అనే సినిమా ఫస్ట్‌ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్‌ సందేశ్‌ ఆ పోస్టర్ లో మరీ గుర్తించలేనంతగా మారిపోయి కనిపించాడు.

ఇందువదన పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. పోస్టర్‌ లో హీరో హీరోయిన్‌ తన్మయత్వంలో మునిగి ఉన్నారు. పోస్టర్‌ వరకే అలా ఉంటుంది. సినిమాలో అంత సీన్ ఏమీ లేకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇందువదన సినిమా లో వరుణ్‌ సందేశ్‌ బోల్డ్‌ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడట. శృతి మించిన శృంగారం ఈ సినిమాలో ఉంటుందని యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

ఇప్పటి వరకు క్యూట్‌ బాయ్ గా లవర్‌ బాయ్ గా వరుణ్‌ సందేశ్ ను చూశాం. అలాంటి వరుణ్‌ సందేశ్‌ ఉన్నట్లుండి బోల్డ్‌ పాత్రలో రొమాంటిక్ సీన్స్ లో నటిస్తే చూడగలమా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లవర్‌ బాయ్ ని రొమాంటిక్ పాత్రలో చూడటం కు కాస్త ఇబ్బందే అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తుంటే చాలా గ్యాప్‌ వచ్చిన కారణంగా వరుణ్‌ సందేశ్‌ ను అలా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం కూడా ఉందంటున్నారు. వరుణ్‌ కు జోడీగా ఫర్నాజ్‌ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు ఎంఎస్ఆర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.