అగ్ర దర్శకుడు తన సొంత సినిమాలపై దృష్టి పెట్టడం లేదా..?

Tue Jun 28 2022 07:00:01 GMT+0530 (IST)

Is the top director focusing on his own films

టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న ఒకతనిపై టాప్ హీరోలు అందరూ అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అతను రచయితగా కెరీర్ ప్రారంభించి తర్వాత రోజుల్లో డైరెక్టర్ గా మారాడు. వరుస విజయాలు అందుకొని క్రేజీ దర్శకుడిగా అవతరించాడు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకులలో ఒకరిగా ఉన్నాడు. తన తదుపరి చిత్రాన్ని ఓ బిగ్ స్టార్ తో చేయనున్నారు. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. దీనికి కారణం ఫైనల్ డ్రాఫ్ట్ ఇంకా లాక్ కాకపోవడమే అని అంటున్నారు.

ఇప్పటికే దర్శకుడు ఫైనల్ నేరేషన్ ఇవ్వగా.. సెకండాఫ్ విషయంలో స్టార్ హీరో అసంతృప్తిని వ్యక్తం చేసారట. అంతేకాదు పలు మార్పులు సూచించారట. ప్రస్తుతం ఆ డైరెక్టర్ హీరో సజెస్ట్ చేసిన అంశాలపైనే కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది.

నిజానికి రెండేళ్ల క్రితమే బేసిక్ ఐడియాని లాక్ చేశారు. కానీ ఇంతవరకు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయాడు. దీనిని కారణం ఆ డైరెక్టర్ ఎక్కువగా వేరే హీరో చేసే ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టి తాను దర్శకత్వం వహించబోయే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టకపోవడమే అని అంటున్నారు.

దర్శకుడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించడంతో పాటుగా తన సన్నిహిత బ్యానర్లలో ప్రధాన వాటాను కూడా కలిగి ఉన్నాడు. ఆ నిర్మాణ సంస్థల్లో రూపొందే సినిమాల కథలను పర్యవేక్షిస్తూ.. దర్శకులను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు అతని స్నేహితుడి కోసం ప్రాజెక్ట్స్ సెట్ చేయడం సమయం వెచ్చిస్తున్నాడు.

దీంతో తన సినిమాలపై తగినంత శ్రద్ధ చూపడం లేదని.. అందుకే రెండేళ్ల క్రితం తన చివరి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుని కూడా తదుపరి ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారని కామెంట్స్ వస్తున్నాయి.

వాస్తవానికి గతేడాది ఓ అగ్ర హీరోతో ఆ దర్శకుడు ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. అయితే ఇది క్యాన్సిల్ అయింది. ఈ స్క్రిప్టును లైట్ తీసుకొని వేరే హీరో సినిమా కోసం వర్క్ చేయడమే దీనికి కారణమనే టాక్ కూడా నడిచింది. ఆ తర్వాత సెట్ చేసిన సినిమాపైనే ఇదే తరహా రూమర్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టుకొని కూడా తన మిత్రుడు నటించే రీమేక్ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో పాటుగా హోమ్ బ్యానర్ లో చిత్రాలను కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఆ దర్శకుడితో పని చేయాల్సిన అగ్ర హీరోలంతా ఆందోళన చెందుతున్నారట. అతను ఇప్పటికైనా మొదటి ప్రాధాన్యత తన చిత్రాలకు ఇవ్వకపోతే కష్టమే అని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.