స్టార్ హీరోయిన్ సీక్రెట్ గా సినిమా నిర్మిస్తోందా..??

Wed Jan 13 2021 21:00:01 GMT+0530 (IST)

Is the star heroine making a movie as a secret

సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఎక్కువగా కమర్షియల్ ప్రకటనలతో పాటు పలు సినిమాలను లైన్ లో పెడుతోంది. అంతేగాక ఆహా ఓటిటి వేదిక పై సామ్ జామ్ అనే టాక్ షో కూడా నడిపించింది. ఇటీవల ఫస్ట్ సీజన్ పూర్తి చేసుకున్న సామ్ జామ్ షో.. సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ షో తోనే ఫుల్ రెమ్యూనరేషన్ అందుకున్న సామ్.. త్వరలో సినీ నిర్మాతగా మారబోతుందని సమాచారం. అదికూడా ఒక ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న సినిమాకి తన పేరు బయటికి రాకుండా సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేస్తోందని టాక్. టాలీవుడ్ యువహీరో సుధీర్ బాబు కథానాయకుడుగా త్వరలో ఓ సినిమా తెరాకెక్కనుంది. ఆ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించనున్నాడు. అయితే ఇదివరకే సుధీర్ బాబు మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం వి సినిమాలు వచ్చాయి.

అయితే మూడోసారి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందట. ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు కూడా ముగిసాయని వినికిడి. అయితే నెక్స్ట్ సినిమాలో సమంత పెట్టుబడి పెడుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇప్పటికే ఈ సినిమా నిర్మాతకు ఐదు కోట్లు అందించిందని.. తన పేరు బయటకి రాకుండా ఆ నిర్మాతతో చేతులు కలిపిందని ఇండస్ట్రీ టాక్. ఇంద్రగంటి వినిపించిన కథ నచ్చడంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయిందట సామ్. ఇక నిర్మాత మహేంద్ర.. ఇంతకుముందు నారా రోహిత్ హీరోగా బాలకృష్ణుడు సినిమా నిర్మించాడు. ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో భారీ గ్యాప్ తీసుకొని ఇప్పుడు సుధీర్ బాబు ఇంద్రగంటిల కాంబో సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక సామ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి అసలు విషయం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.