ఆ దర్శకుడికి రెండవ సినిమా కష్టమేనా?

Tue Aug 16 2022 08:00:01 GMT+0530 (IST)

Is the second film difficult for the director?

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా మూవీ `మాచర్ల నియోజక వర్గం`. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్ . సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. కృతిశెట్టి కేథరిన్ హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ ద్వారా ఎడిటర్ శంకర్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. పొలిటికల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు.  టీజర్ ట్రైలర్ లతో మంచి బజ్ ని క్రియేట్ చేసింది.  అంజలి నితిన్ లపై చిత్రీకరించిన `రారా రెడ్డి నేను రెడీ` అంటూ సాగే సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారి  సినిమాకు మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది. నితిన్ తొలి సారి పవర్ ఫుల్ కలెక్టర్ పాత్రలో నటించిన ఈ మూవీ ఇటీవల ఆగస్టు 12న విడుదలైన తొలి రోజే డివైడ్ టాక్ ని దక్కించుకుని షాకిచ్చింది. ఈ మూవీ రిలీజ్ కు ముందు దర్శకుడు ట్వీట్ కాంట్రోవర్సియల్ ట్వీట్స్ చేసాడు అంటూ  నెట్టింట దుమారం రేగింది. స్వతహాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆ అభిమానంతో వైఎస్సార్ సీపీ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కమ్మ కాపు కులాలని అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్వీట్ లు పెట్టాడంటూ కొంత మంది నెట్టింట దుమారం సృష్టించారు.

స్క్రీన్ షాట్ లతో సహా ట్వీట్ ని వైరల్ చేశారు. అయితే దీనిపై దర్శకుడు వివరణ ఇచ్చారు. ఆ ట్వీట్ లు తను చేసినవి కావు అని ఎవరో పనిగట్టుకుని తన పేరుని వాడుకుని ఫొటో షాప్ లో మార్ఫింగ్ చేశారని స్పష్టం చేశారు. నితిన్ కూడా దర్శకుడికి అండగా నిలిచి అది ఫేక్ అకౌంట్ అని ఆ ట్వీట్ లు తను చేయలేదని స్పష్టం చేశారు. అయినా సరే కొంత మంది దర్శకుడిని టార్గెట్ చేస్తూ నెట్టింట ట్విట్ లు చేశారు. సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం చేశారు.  

ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ పై పడింది. అంతే కాకుండా సినిమాలో కంటెంట్ కూడా బలంగా లేకపోవడం దర్శకుడి ప్రతిభ ఎక్కడా కనిపించకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఏ దర్శకుడికైనా తొలి డిజాస్టర్ గా నిలిస్తే మరో సినిమా లభించడం చాలా కష్టం. ఇప్పడు ఇదే పరిస్థితిని ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎదుర్కోవడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమాలో విషయం లేకపోవడం దర్శకుడిగా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఏ విషయంలోనూ తన ప్రతిభని ప్రదర్శించలేకపోవడంతో అతనికి మరో ఛాన్స్ ఇవ్వడానికి మరో నిర్మాత ధైర్యం చేస్తాడా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.