Begin typing your search above and press return to search.

డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాల పబ్లిసిటీ లైట్ తీసుకుంటున్నారా...?

By:  Tupaki Desk   |   4 July 2020 6:45 AM GMT
డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాల పబ్లిసిటీ లైట్ తీసుకుంటున్నారా...?
X
కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇంటికే పరిమితమైన జనాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో వచ్చే వెబ్ కంటెంట్ ని చూసేస్తున్నారు. ఇక ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కూడా లేకపోవడంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఓటీటీలో వచ్చిన సినిమాలలో కొన్ని మంచి రివ్యూస్ తెచ్చుకోగా మరికొన్ని బ్యాడ్ రివ్యూస్ తో మినిమమ్ వ్యూస్ కూడా తెచ్చుకోలేకపోయాయట.

కాగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలకి మంచి టాక్ వస్తున్నా అనుకునేంతగా ఆడియన్స్ కి చేరడం లేదని.. వర్డ్ అఫ్ మౌత్ పెద్దగా అందుకోవడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకున్న సినిమాలకి అన్ని వ్యూస్ వచ్చాయి.. అంత మంది చూసారు.. ఇంత మంది చూసారు అని లెక్కలు హోరు కనిపించేది. కానీ ఇప్పటి వరకు ఓటీటీలో విడుదలైన ఏ సినిమాకి ఇలాంటి పబ్లిసిటీ చేయలేదు. నిజానికి ఈ మధ్య స్ట్రీమింగ్ అయిన తెలుగు సినిమాలు మంచి టాక్ మరియు రివ్యూస్ తెచ్చుకున్నాయి. కానీ ఈ సినిమాల విషయంలో అటు ఓటీటీ వారు ఇటు ప్రొడక్షన్ వారు మెయిన్ స్ట్రీమ్ పబ్లిసిటీ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది.

అందువల్ల సినిమా బాగుందని టాక్ వచ్చినా పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారు. ఏదో సినిమాని వదిలించేసుకున్నాం అనే పద్ధతిలో నిర్మాతలు వ్యవహరిస్తుంటే.. మనుకున్న లైబ్రరీలో మరొక సినిమా వచ్చి చేరింది అనే రీతిన ఓటీటీ వారు ఉన్నారనేది సినీ విమర్శకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వారు.. లోకల్ గా 'ఆహా' వారు ఏదో పబ్లిసిటీ చేస్తూ వస్తున్నా అది నామమాత్రంగానే ఉందనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఓటీటీ సినిమాల పబ్లిసిటీ విషయంలో ప్రొడ్యూసర్స్ మరియు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయో మరి..!