Begin typing your search above and press return to search.

'ఉప్పెన‌' డైరెక్ట‌ర్ కి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   25 Jan 2022 6:17 AM GMT
ఉప్పెన‌ డైరెక్ట‌ర్ కి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?
X
మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం `ఉప్పెన‌`. ఈ మూవీ ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి ఈ స్థాయి క‌లెక్ష‌న్ ల‌ని రాబ‌ట్టిన సినిమాగా రికార్డుని క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న ఆయ‌న ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.

వెంట‌నే ఆయ‌న‌కు స్టార్ హీరోల నుంచి వ‌రుస ఆష‌ర్లు రావ‌డం మొద‌లైంది. అందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ భాకీ చిత్రాన్ని తెర‌కెక్కించే అవవ‌కాశాన్ని అందుకున్నారు. బుచ్చిబాబుతో సినిమాను అయితే ఫైన‌ల్ చేశారు కానీ ఎన్టీఆర్ వెంట‌నే త‌న‌తో సినిమా చేయ‌డానికి మాత్రం ప్ర‌స్తుతం సిద్ధంగా లేరు. `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ కి ఛాన్స్ ఇచ్చారు. అదీ పూర్తి కావాలి.

ఈ రెండు చిత్రాల త‌రువాతే బుచ్చిబాబు సినిమా వుంటుంది. కానీ అట్ల‌కు మార్ మాత్రం ఇద్ద‌రు హీరోల‌ని ఆప్ష‌న్ గా పెట్టుకోవ‌డంతో బుచ్చిబాబు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. అట్లీ కుమార్ తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ ల‌లో ముందు ఎవ‌రై త‌న క‌థ‌ని ఓకే చేస్తే వారితో సినిమా చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఇద్ద‌రు హీరోల్లో ముందు బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. దీంతో అట్లీ కుమార్ - ఎన్టీఆర్ మూవీ కి బ్రేక్ ప‌డింది.

అట్లీ - ఎన్టీఆర్ సినిమాకు బ్రేక్ ప‌డిందంటే బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే. కొర‌టాల సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ - బుచ్చిబాబు సినిమాకు వ‌చ్చేస్తార‌న్న‌మాట‌. దీంతో ఇండైరెక్ట్ గా బ‌న్నీ ... బుచ్చిబాబు - ఎన్టీఆర్ ల సినిమాకు లైన్ క్లియ‌ర్ చేశార‌ని చెబుతున్నారు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఓ స్పోర్ట్స్ డ్రామాని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో వుండ‌బోతోంది.