Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ బ్యాన‌ర్ తో యువ‌హీరో గొడవ ముగిసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   25 Jan 2021 2:30 AM GMT
ప్ర‌ముఖ బ్యాన‌ర్ తో యువ‌హీరో గొడవ ముగిసిన‌ట్టేనా?
X
ప్ర‌ముఖ బ్యాన‌ర్ తో టాలీవుడ్ యంగ్ ‌హీరో గొడ‌వ ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రారంభ‌మై మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం అటుపై ఇరువురి మ‌ధ్య ర‌క‌ర‌కాలుగా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం సాగ‌‌డంపై ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. ఇంత‌కీ ఆ గొడ‌వ సెటిల్ అయిందా? అంటే తాజాగా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.

కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి దూకుడుమీదున్న స‌ద‌రు యువ‌హీరో అప్ప‌ట్లోనే ప్ర‌ముఖ బ్యాన‌ర్ మూవీ కోసం కోటి అడ్వాన్స్ అందుకుని సినిమాని మొద‌లుపెట్టాడు. దాదాపు 12 రోజులు షూటింగ్ కూడా ఈ సినిమాకు జ‌రిగింది..! ఓ యువ‌ ద‌ర్శ‌కుడుతో సినిమాను తెర‌కెక్కించ‌‌డానికి ట్రై చేశారు..! అయితే ఎందుకో ఈ షూట్ ఆగిపోయి సినిమా క్యాన్సిల్ అయిపోయింది.

అయితే అప్ప‌టికే అడ్వాన్స్ రూపంలో దాదాపు కోటి రూపాయ‌లు ముట్ట‌డంతో దానికి సంబంధించిన సెటిల్ మెంట్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ట‌. ఆ గొడ‌వ‌లు ఇప్ప‌టికీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయని తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ను స‌ద‌రు యువ‌హీరోతో వేరొక యువ‌నిర్మాత‌తో పూర్తి చేస్తున్నారు‌. స‌ద‌రు యువ‌నిర్మాత కోసం ఏకంగా నాలుగు కోట్ల నుంచి దిగొచ్చి కేవ‌లం కోటిన్నర పారితోషికానికే ఆ హీరోగారు ప‌ని చేస్తున్నార‌‌ని తెలిసింది.

అలానే ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయిని తీసుకోబోతున్నారు. ఎందుకంటే గ‌తంలో ఆగిపోయిన ప్రాజెక్ట్ కి ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అనుకోకుండా ఆగిపోయింది కాబ‌ట్టి త‌న‌కే మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చార‌ట‌. చివ‌రికి ఆ బ్యాన‌ర్ తో యువ‌హీరో గొడ‌వ కొన‌సాగ‌డం స‌రికాదు కాబ‌ట్టి ప‌రిష్క‌రించుకోవాల‌నే కోరుకుంటోంది ప‌రిశ్ర‌మ‌.