దిల్ రాజు సతీసమేత అమెరికా యాత్ర అందుకోసమేనా..?

Tue May 11 2021 22:00:01 GMT+0530 (IST)

Is that why Dil Raju traveled to America with wife

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సతీమణి వైఘా రెడ్డి(తేజస్విని)ని తీసుకుని ఇటీవల అమెరికాకు వెళ్లినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' సక్సెస్ తో హ్యాపీ గా నిర్మాత సడన్ గా భార్యతో కలిసి యూఎస్ ఎందుకు వెళ్ళాడో అని అందరూ డిస్కష్ చేసుకున్నారు. అయితే దిల్ రాజు దంపతులు తమ మొదటి పెళ్లి రోజు వేడుకలని జరుపుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తుంది.దిల్ రాజు తన మొదటి భార్య చనిపోవడంతో కొన్నాళ్ళకు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో మే 10న తన స్వస్థలమైన నిజామాబాద్ లోని ఓ గుడిలో దిల్ రాజు వివాహం చేసుకున్నారు. అంటే నిన్నటికి వీరి పెళ్లి జరిగి ఒక ఏడాది పూర్తయ్యింది. ఎప్పటినుంచో భార్యతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తున్న నిర్మాత.. ఇప్పుడు తమ ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోడానికి అమెరికాలో వాలిపోయారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' ప్రాంఛైజీలో 'ఎఫ్ 3' సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ - వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబోలో 'థాంక్యూ' అనే సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని నటిస్తున్న 'శాకుంతలం' చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

అలానే దిల్ రాజు తమ ఫ్యామిలీ నుంచి ఆశిష్ ని హీరోగా పరిచయం చేస్తూ 'రౌడీ బాయ్స్'.. అవసరాల శ్రీనివాస్ తో 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ - వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడని సమాచారం.