Begin typing your search above and press return to search.

భోళా శంకర్ లో మిల్కీ బ్యూటీ పాత్ర అంతేనా..?

By:  Tupaki Desk   |   7 Dec 2022 4:54 AM GMT
భోళా శంకర్ లో మిల్కీ బ్యూటీ పాత్ర అంతేనా..?
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వేదాళం రీమేక్ 'భోళా శంకర్‌' సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. చాలా మంది ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ మధ్య ఈ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అసలు ఈ సినిమా ఔట్‌ పుట్‌ విషయంలో చిరు సంతృప్తిగా లేకపోవడంతో అటకెక్కించారు అనేది ఆ పుకార్ల సారాంశం. కానీ ప్రస్తుతం చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా హడావుడి పూర్తి అయిన తర్వాత భోళా శంకర్ సినిమా ను చిరంజీవి పూర్తి చేసే ఉద్దేశ్యంతో ఉన్నాడని తెలుస్తోంది.

భోళా శంకర్ సినిమా మెజార్టీ షూటింగ్‌ పార్ట్‌ పూర్తి అయ్యింది. కొన్ని పాటలు మరియు సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆమె షూట్‌ లో పాల్గొని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

తాజాగా గుర్తుందా శీతాకాలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తమన్నా మాట్లాడుతూ తాను చిరంజీవి గారితో భోళా శంకర్ సినిమా ను చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆ సినిమా షూట్‌ లో పాల్గొనలేదు. వచ్చే నెల నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా పేర్కొంది.

ఇప్పటి వరకు భోళా శంకర్‌ సినిమా షూటింగ్‌ లో తమన్నా జాయిన్‌ అవ్వలేదు అంటూ ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉంటుందని.. పాటలకు మరి కొన్ని సన్నివేశాల వరకే పరిమితం అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది. మిల్కీ బ్యూటీ మొత్తంగా రెండు నుండి మూడు వారాలు అయినా భోళా శంకర్ షూట్‌ లో పాల్గొంటుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె అయినా షూటింగ్‌ లో పాల్గొందో లేదా తమన్నా మాదిరిగానే తాను కూడా వచ్చే నెల నుండి షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లుగా చెప్పబోతుందో అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.