Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కు వేళ‌యిందా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 10:30 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కు వేళ‌యిందా?
X
కొత్త త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఏ మాత్రం కొత్త‌గా వున్నా స్టార్ హీరో, చిన్న హీరో అని చూడ‌టం లేదు.. భారీ స్థాయిలో ఆద‌రిస్తున్నారు. దీంతో చాలా మంది యంగ్ హీరోలు కొత్త క‌థ‌ల‌ని ఎంచుకుంటూ త‌మ స‌త్తా చాటేందుకు రెడీ అయిపోతున్నారు. హీరోలుగా న‌టించ‌డ‌మే కాకుండా తాము న‌టిస్తున్న సినిమాల‌కు క‌థ ర‌చ‌యిత‌లుగానూ వ్య‌వ‌హ‌రిస్తూ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని సొంతం చేసుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలుస్తున్నారు.

స‌రిగ్గా ఇదే త‌ర‌మాలో వ్య‌వవ‌హ‌రించి యంగ్ హీరో సిద్దూ జొన్న‌లగ‌డ్డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ట్రేడ్ ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ సెస్సేష‌న‌ల్ మూవీ 'డీజే టిల్లు'. ద‌క్క‌న్ స్లాంగ్ లో హైద‌రాబాదీ స్టైల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీకి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ ద‌ర్శ‌కుడితో క‌లిసి ర‌చ‌యిత‌గా కూడా వ్య‌వ‌హ‌రించి సినిమా విజ‌యంలో కీల‌క భూమిక పోషించాడు.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నామిన‌ల్ బ‌డ్జెట్ లో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దాదాపు 30 కోట్ల వ‌ర‌కు ఈ మూవీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. ఫిబ్ర‌వ‌రిలో భారీ చిత్రాల రిలీజ్ స‌మ‌యంలో విడుద‌లైన ఈ చిన్న సినిమా రికార్డు స్థాయి విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. నేహా శెట్టి సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ న‌ట‌న, త‌మ‌న్ పేప‌థ్య సంగీతం, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, రామ్ మిర్యాల సాంగ్స్‌ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ గా మార్చాయి.

ఈ మూఈ క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ వ‌దిలేశారు. పారిస్ వెళుతున్నాన‌ని, అక్క‌డ రాధిక ఇవ్వాల్సిన డ‌బ్బులు సెటిల్ చేస్తాన‌ని టిల్లు చెప్ప‌డంతో సినిమాకు ఎండ్ కార్డ్ వేశారు. అంటే పార్ట్ 2 మొత్తం పారిస్ నేప‌థ్యంలో వుంటుంద‌ని హింట్ ఇచ్చేశార‌న్న‌మాట‌.

శ‌నివారం ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ట్టుగా చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ ని షేర్ చేశారు. 'మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీకి సంబందించిన‌ రౌండ్ 2 మొద‌ల‌వుతోంద‌ని, క్రేజీ అడ్వెంచ‌ర్ గా రూపొంద‌నున్న ఈమూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని వెల్ల‌డించారు.

అయితే సినిమా ఏంటీ? .. ఎవ‌రు హీరో అన్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇండైరెక్ట్ గా 'డీజే టిల్లు 2' అనే అర్థం వ‌చ్చేలా నాగ‌వంశీ చేసిన ట్వీట్‌, ముహూర్తంకు సంబంధించిన పిక్స్ ఇప్ప‌డు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. దీనిక సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం అధికారికంగా త్వ‌ర‌లోనే వెల్ల‌డించే అవ‌కాశం వుంది.