Begin typing your search above and press return to search.

ఇది మరో 'జాతి రత్నాలు' అవ్వబోతుందా?

By:  Tupaki Desk   |   29 July 2021 10:51 AM GMT
ఇది మరో జాతి రత్నాలు అవ్వబోతుందా?
X
కంటెంట్ ఉన్న సినిమాలకు స్టార్స్ తో పని లేదు అని ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన జాతిరత్నాలు సినిమా నిరూపించింది. నవీన్ పొలిశెట్టి.. ప్రియదర్శి.. రాహుల్‌ రామకృష్ణ లు నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. సూపర్ హిట్ అవ్వాలంటే యూత్‌ ఆడియన్స్ ను కట్టిపడేసే విధంగా ఉండాలి.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చర్చించే విధంగా ఉండాలి. అలాంటి సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్‌ విజయాలను దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఉప్పెన సినిమా కూడా బ్లాక్ బస్టర్‌ సక్సెస్ గా నిలిచింది. ఆ సినిమా లో స్టార్స్ లేకున్నా.. కొత్త దర్శకుడు కొత్త హీరో కొత్త హీరోయిన్ అయినా కూడా ఉప్పెనల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ఒక మంచి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఒక సినిమా రాబోతుంది. అదే ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం. ఈ సినిమా గురించి గత సంవత్సరం నుండి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే జనాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. చూశాలే కల్లార పాట చాలా కాలంగా ట్రెండ్‌ అవుతూ ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ముగ్గురు కుర్రాళ్ల కథ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో సాయి కుమార్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఇన్నాళ్లు రొటీన్‌ పాత్రలు చేస్తున్న సాయి కుమార్ ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్‌ చూసిన తర్వాత ఇది మరో జాతిరత్నాలు సినిమా అవుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

జాతి రత్నాలు సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఆరోగ్యవంతమైన కామెడీ ఉన్నట్లుగా అనిపిస్తుందని.. అలాగే కొన్ని సెంటిమెంట్ ఎమోషనల్‌ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. హీరోగా కిరణ్‌ అబ్బవరపు గత చిత్రంతో మంచి పేరు దక్కించుకున్నాడు. ఈ సినిమాకు అతడే స్వయంగా కథను స్క్రీన్‌ ప్లే మరియు మాటలను అందించడం విశేషం. ఇక ఈ సినిమాలో యూట్యూబ్‌ స్టార్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న అనీల్‌ జీలా కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైన్ మెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కావాల్సినంతగా ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నరు. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. ఈమద్య కాలంలో సినిమాలు కరోనా కారణంగా విడుదల కాలేదు. ఈ సినిమా కనుక కాస్త యూత్‌ కు కనెక్ట్‌ అయ్యేలా ఉంటే మాత్రం ఊహించని విధంగా భారీగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.