'సలార్' లో రౌడీ..నెట్టింట వైరల్ గా మారిన ఫొటో!

Mon Nov 28 2022 17:06:55 GMT+0530 (India Standard Time)

Is Vijay Devarakonda in Salaar Movie

వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. మూడున్నరేళ్లు ఈ మూవీ కోపం విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టాడు. ఎన్నో దెబ్బలకు ఓర్చుకున్నాడు. ఎన్నో గాయాల్ని తనలో దాచుకున్నాడు. ఈ మూవీతో ఒకేసారి హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలని పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ 'లైగర్' ఫలితంతో ఆ కలలన్నీ కల్లలయ్యాయి.'లైగర్' రిజల్ట్ తో కొంత నిరాశకు గురైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న 'ఖుషీ' మూవీలో నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. తన అనారోగ్యం కారణంగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ గత కొన్ని రోజులుగా ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం సామ్ మయో సైటీస్ వ్యాధితో బాధపడుతోంది. త్వరలో ఆమె ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లబోతోంది.

ట్రీట్మెంట్ అనంతరం సామ్ 'ఖుషీ' షూటింగ్ లో పాల్గొంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త విజయ్ దేవరకొండ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సలార్'. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా కీలక రోల్ లో కనిపించబోతున్నాడంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

'సలార్'లో విజయ్ కూడా నటిస్తున్నాడంటూ పలు ఆంగ్ల పత్రికల్లోనూ భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రభాస్ 'సలార్' లుక్ తరహాలోనే విజయ్ దేవరకొండ సెట్ లో బ్లూ కలర్ హాఫ్ టీషర్ట్ లో కనిపిస్తున్న ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఫొటోతో పాటు మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారం జరుగుతోంది. 'సలార్' క్లైమాక్స్ లో విజయ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తారని 'సలార్ 2'లో విజయ్ దేవరకొండ కీ రోల్ లో కనిపించనున్నారని నెటిజన్ లు చర్చించుకుంటున్నారు.

నెటిజన్ లు ఈ ఫొటోని తెగ వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇదిలా వుంటే ఈ ఫొటో వెనకున్న అసలు స్టోరీని బయటపెట్టారు. విజయ్ దేవరకొండ కొత్త థమ్స్ అప్ యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడని హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోందని చెబుతున్నారు. కానీ కొంత మంది మాత్రం విజయ్ లుక్ చూసి ఇది 'సలార్' లుక్ అని తను కూడా ఇందులో నటిస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుంటే విజయ్ దేవరకొండ తన కారవ్యాన్ లో బాడీగార్డ్ బర్త్ డే ని జరపడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.