Begin typing your search above and press return to search.

'రంగమార్తాండ' కు ఇద్దరు దర్శకులా?

By:  Tupaki Desk   |   14 Dec 2019 8:16 AM GMT
రంగమార్తాండ కు ఇద్దరు దర్శకులా?
X
క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం 'రంగమార్తాండ'. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. మరాఠి చిత్రం నటసామ్రాట్‌ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చి రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో రమ్యకృష్ణ.. ప్రకాష్‌ రాజ్‌.. బ్రహ్మానందం ఇంకా ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాకు కృష్ణవంశీ మాత్రమే కాకుండా ప్రకాష్‌ రాజ్‌ కూడా దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు కృష్ణవంశీ మరియు ప్రకాష్‌ రాజ్‌ లు మంచి మిత్రులు. కాని కొన్ని కారణాల వల్ల గొడవలు వచ్చి కొంత గ్యాప్‌ మెయింటెన్‌ చేశారు. మళ్లీ గోవిందుడు అందరి వాడేలే చిత్రం సమయంలో వీరిద్దరు కలిసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత మళ్లీ వీరిద్దరు 'రంగమార్తాండ' సినిమా కోసం పని చేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ నటిస్తూనే స్క్రిప్ట్‌ విషయంలో మరియు స్క్రీన్‌ ప్లే విషయంలో ఒక సహాయ దర్శకుడి మాదిరి గా కృష్ణవంశీ కి హెల్ప్‌ చేస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. స్క్రిప్ట్‌ బాగా నచ్చడం వల్ల ప్రకాష్‌ రాజ్‌ ఈ చిత్రంను చాలా ఆసక్తి తో చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రేక్షకుల్లో కూడా చాలా ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.