పవన్ సినిమా మరింత ఆలస్యం కానుందా?

Fri Sep 30 2022 12:43:40 GMT+0530 (India Standard Time)

Is There a Delay in Pawan Kalyan Film?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత విరామం తరువాత రీమేక్ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా రూపొందిన 'వకీల్ సాబ్' మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ అదే పంథాని కొనసాగిస్తూ బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లని పట్టాలెక్కించారు. ఇదే సమయంలో కోవిడ్ కి ముందు  భారీ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హరి హర వీరమల్లు'ని మొదలు పెట్టారు. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది.దీంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకోవడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ ని ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. పవన్ కల్యాణ్ కూడా ఈ మూవీ చాలా స్పెషల్ గా చూస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ గత కొంత కాలంగా ఆగుతూ సాగుతూ వెళుతోంది.  

ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా? .. వెళ్లదా? అనే అనుమానాలు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'పవర్ గ్లాన్స్' పేరుతో ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేశారు. ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. ఊహించని వీడియో బయటికి రావడంతో అంతా సినిమా ఓ రేంజ్ లో వుంటుందని అంచనాలు పెట్టుకున్నారు.

గత కొన్ని నెలలుగా షూటింగ్ విషయంలో క్లారిటీ లేని ఈ మూవీ తదుపరి షెడ్యూల్ అక్టోబర్ నుంచి ప్రారంభం అయి డిసెంబర్ వరకు పూర్తి చేస్తారని ఈ మూవీని పూర్తి చేయడానికి పవన్ డేట్స్ కూడా కేటాయించాడని ఆ డేట్స్ లోనే సినిమాని పూర్తి చేయాలని డిమాండ్ ని కూడా పెట్టారని వార్తలు వినిపించాయి. ఇందు కోసం ఈ మూవీకి కావడాల్సిన గెటప్ లోనే పవన్ వుంటూ వచ్చారు. అయితే తాజాగా బయటికి వచ్చిన పవన్ లుక్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హేయిర్ కట్ చేసుకుని లైట్ గడ్డంతో పవన్ జనసేన పార్టీ కార్యాలయంలో కనిపించిన లుక్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ 'హరి హర వీరమల్లు' తాజా షెడ్యూల్ కి ట్విస్ట్ ఇస్తున్నారా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

అంతా అన్నట్టుగా అక్టోబర్ లో తాజా షెడ్యూల్ మొదలవుతుందా? మళ్లీ ట్విస్ట్ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.