Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్-2 ఆరంభం చంద్ర‌బాబుతోనా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:50 AM GMT
అన్ స్టాప‌బుల్-2 ఆరంభం చంద్ర‌బాబుతోనా?
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ హోస్ట్ గా చేసిన‌ ఆహా అన్ స్టాప‌బుల్ షో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ షోకి బాల‌య్య మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌రు అనిపించింది. త‌న‌దైన శైలి చ‌మ్మ‌క్కులు..సెటైర్లు ఆద్యంతం అన్ స్టాప‌బుల్ ని ర‌క్తి క‌ట్టించాయి. ఓటీటీ వేదిక‌గా సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూలు చేయ‌డం ఓటీటీ చ‌రిత్ర‌లోనే ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం.

దానికి బాల‌య్య ఇమేజ్ తోడ‌వ్వ‌డంతో ఆహా మైలేజ్ ఒక్క‌సారిగా పెరిగింది. త్వ‌ర‌లో అన్ స్టాప‌బుల్ -2 ప్రారంభం కానుంది. దీనిని బాల‌య్య నే హోస్ట్ చేస్తున్నారు. ముందుగా ఈ షోకి గెస్ట్ లుగా ప్రాణ‌ స్నేహితులు ప‌వ‌న్ కళ్యాణ్-త్రివిక్ర‌మ్ ని తీసుకురావాల‌నుకున్నారు. వాళ్లిద్ద‌రితో అన్ స్టాప‌బుల్-2 ని వాళ్లిద్ద‌రితో లాంచ్ చేస్తే నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంద‌ని ప్లాన్ చేసారు.

ఇంకా స‌మంత స‌హా ప‌లువురు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ అర‌వింద్..బాల‌య్య అండ్ కో పెద్ద షాక్ ఇచ్చారు. ఏకంగా సీజ‌న్-2 మొద‌టి ఎపిసోడ్ మాజీ ముఖ్య‌మంత్రి..టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో నే లాంచ్ చేయ‌డానికి రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రా సంద‌ర్భంగా అన్ స్టాప‌బుల్ సెట్ నుంచి చంద్ర‌బాబు..బాల‌య్య క‌లిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట సంచ‌ల‌నంగా మారాయి.

చంద్ర‌బాబుని అల్లు అర‌వింద్ దగ్గ‌రుండి రిసీవ్ చేసుకోవ‌డం వంట‌లి స‌న్నివేశాలు అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి. దీంతో బాలయ్య -చంద్రబాబు మధ్య మాటలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎపిసోడ్ మధ్యలో లోకేష్ కూడా ఎంట్రీ ఇస్తారని సమాచారం. అల్లుడితో మామ ఎలా మాట్లాడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

మొత్తానికి అన్ స్టాప‌బుల్-2 మొద‌టి సీజ‌న్ నారా వారి బ్యాచ్ తో గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఈ ఐడియా ఎవ‌ర‌ద‌న్న‌ది తెలియాలి. బాల‌య్య‌ని హోస్ట్ గా లాంచ్ చేయాల‌న్న ఐడియా మాత్రం అల్లు అర‌వింద్ దే. బాల‌య్య‌ని ఒప్పించడంకోసం నేరుగా అర‌వింద్ నే రంగంలోకి దిగారు. తాజాగా చంద్ర‌బాబు ఎంట్రీ వెనుక అర‌వింద్ కీల‌క పాత్ర పోషించి ఉంటార‌ని మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.