Begin typing your search above and press return to search.

సైరా డైరెక్టర్‌ భవిష్యత్‌ ఏంటో?

By:  Tupaki Desk   |   27 March 2020 1:30 AM GMT
సైరా డైరెక్టర్‌ భవిష్యత్‌ ఏంటో?
X
సైరా డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినా సాలిడ్ హిట్లు కెరీర్ ని ఆదుకున్నాయి. తొలి సినిమా `అతనొక్కడే`తోనే తానేంటో నిరూపించుకుని మాస్ యాక్ష‌న్ స్టైల్లో తన పంథాని చాటుకున్నాడు. ఆ తర్వాత కిక్‌- ఊసరవెల్లి- రేసుగుర్రం- ధృవ చిత్రాలతో స్టార్‌ డైరెక్టర్‌ గా ఎదిగారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవితో రూపొందించిన హిస్టారికల్‌ పీరియడ్‌ డ్రామా `సైరా- నరసింహారెడ్డి`తో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తెలుగేత‌ర రాష్ట్రాల్లో అనుకున్నస్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోయినప్పటికీ డైరెక్టర్ గా సురేందర్‌ రెడ్డి స్టామినా గ్రేట్ అని పొగిడేశారు ప్ర‌ముఖులు. దీంతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా పేరొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ.. సైరా లాంటి చిత్రాన్ని రిలీజ్ చేసినా.. ఇంకా ఈ డైరెక్టర్ కి సినిమా సెట్‌ కాలేదేమిటో. నెక్ట్స్ సినిమా ప్ర‌క‌ట‌న రాలేదు. ప్రభాస్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందని ఓ వార్త వినిపించింది. ఆ తర్వాత ప‌వ‌న్- మహేష్‌- చరణ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.

తాజాగా బన్నీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నాడంటూ తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తమ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం `రేసుగుర్రం`కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వీరి మధ్య డిస్కషన్‌ కూడా జరిగినట్టు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఈ సినిమా నిజంగానే ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బన్నీ ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయింది. దీంతోపాటు వేణు శ్రీరామ్‌ డైరెక్షన్ లో `ఐకాన్‌` పేరుతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చాడు. సుకుమార్‌ సినిమా తర్వాత వేణు శ్రీరామ్‌ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్‌. ఈ లోపు వేణు... పవన్‌ కళ్యాణ్ తో చేస్తున్న `వకీల్‌ సాబ్‌`ని పూర్తి చేసుకుని వస్తాడట. ఈ నేపథ్యంలో సురేందర్‌ రెడ్డితో సినిమా ఎప్పుడుంటుందనేది సస్పెన్స్ గా మారింది. వేణు సినిమా తర్వాత సురేందర్‌ రెడ్డి సినిమా ఉంటే దాదాపు ఏడాదిపైనే వెయిట్‌ చేయాల్సి వస్తుంది.

సైరా వంటి హిట్‌ చిత్రాన్నిఅందించిన తర్వాత కూడా దాదాపు రెండేళ్ళు వెయిట్‌ చేయాల్సి రావడం విచారకరం. మరి అప్పటివరకు సురేందర్‌ రెడ్డి వెయిట్‌ చేస్తాడా లేక ఈలోపు మరే హీరో అయినా దొరికితే సినిమా చేస్తాడా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.