Begin typing your search above and press return to search.

శ్రీలీల మరో కృతి శెట్టి అవ్వబోతుందా?

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 PM GMT
శ్రీలీల మరో కృతి శెట్టి అవ్వబోతుందా?
X
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా విడుదలకు ముందే కృతి శెట్టికి మంచి ఆఫర్లు వచ్చాయి. ఆమె భారీ ఎత్తున అవకాశాలను దక్కించుకోవడంతో పాటు తన పారితోషికం మొదటి సినిమాకు పది లక్షలు తీసుకుని ఇప్పుడు కోటి రూపాయలకు పైగా పారితోషికంను తీసుకుంటుంది. మొదటి సినిమా విడుదల అయ్యి ఏడాది కూడా కాకుండానే కృతి శెట్టి కోటి పారితోషికం దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అయిదు ఆరు సినిమాలు ఉన్నాయి. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి కృతి శెట్టి టాలీవుడ్‌ లో యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది. వచ్చే ఏడాది ఈమె నటించిన సినిమాలు రెండు మూడు విడుదల అయినా కూడా స్టార్‌ హీరోల నుండి కూడా ఈమెకు పిలుపు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కృతి శెట్టి ఎలా అయితే టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోందో అదే దారిలో శ్రీలీల కూడా మొదటి సినిమా విడుదల అవ్వకుండానే బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు దక్కించుకుంటుంది.

పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కన్నడ బ్యూటీ శ్రీలీలా పరిచయం అవ్వబోతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయం అవుతున్న పెళ్లిసందD లో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ఇప్పటికే విడుదల అయిన పాటలు మరియు టీజర్ ట్రైలర్ తో శ్రీలీలా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యే ఫేస్ అవ్వడంతో పాటు ఆమె మంచి అందం మరియు ప్రతిభ కలిగిన అమ్మాయి అంటూ రాఘవేంద్ర రావు నుండి కితాబు పొందింది. అందుకే ఆమెకు తెలుగు యంగ్‌ హీరోలు వరుసగా ఆఫర్లు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. పలువురు దర్శకులు ఆమెతో టచ్ లోకి వెళ్లారు అంటూ వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా రూపొందబోతున్న త్రినాథరావు నక్కిన సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరి కాంబోలో మాస్ మసాలా ఎంటర్ టైనర్‌ మూవీ గత ఏడాదిలోనే పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా కరోనా ఇతర కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు రవితేజ తన కమిటెడ్‌ ప్రాజెక్ట్‌ లను పూర్తి చేశాడు. శ్రీలీల హీరోయిన్ గా రవితేజకు జోడీగా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని సమాచారం అందుతోంది. ఆమె ను టాలీవుడ్‌ లో మరింత మంది దర్శకులు మరియు హీరోలు కోరుతున్నారని టాక్ వినిపిస్తుంది. శ్రీలీలా ముందు ముందు టాలీవుడ్ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అంటున్నారు. టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉప్పెన హీరోయిన్‌ శృతి శెట్టి కనుక ఎలా అయితే మొదటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యిందో అలాగే శ్రీలీలా కూడా మొదటి సినిమాతోనే స్టార్ గా ఎదగబోతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.