Begin typing your search above and press return to search.

ఓటీటీ వరల్డ్ లో సౌత్ హీరోయిన్స్ సక్సెస్ అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   16 April 2021 8:30 AM GMT
ఓటీటీ వరల్డ్ లో సౌత్ హీరోయిన్స్ సక్సెస్ అయినట్లేనా..?
X
వెబ్ కంటెంట్ హవా స్టార్ట్ అవడంతో స్టార్ యాక్టర్స్ డైరెక్టర్స్ వెబ్ వరల్డ్ లో అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నప్పటికీ.. సౌత్ ఇండస్ట్రీలో కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఈ ట్రెండ్ మొదలైంది. దక్షిణాది నుంచి సమంత అక్కినేని - ప్రియమణి - కాజల్ అగర్వాల్ - తమన్నా భాటియా - శృతి హాసన్ - నిత్యా మీనన్ - పాయల్ రాజ్ పుత్ - ఈషా రెబ్బా - అమలా పాల్‌ - అషిమా నర్వాల్ వంటి హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించారు.

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'లైవ్ టెలికాస్ట్' అనే హారర్ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి డెబ్యూ ఇచ్చింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ లో విడుదలైంది. అయితే కాజల్ నటించిన మొట్టమొదటి వెబ్ కంటెంట్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. మరో అగ్ర కథానాయిక మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాట్ స్టార్ కోసం 'నవంబర్ స్టోరీస్'.. ఆహా యాప్ కోసం '11త్ అవర్' అనే ఒరిజినల్ సిరీస్ లలో నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కార్పొరేట్ డ్రామాగా రూపొందిన '11త్ అవర్' తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'నవంబర్ స్టోరీస్' త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ప్రియమణి అందరికంటే ముందుగానే ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టింది. 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ కో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో పలు హిందీ వెబ్ కంటెంట్ లలో నటించారు. త్వరలో 'ది ఫ్యామిలీ మ్యాన్2' తో రాబోతోంది. బబ్లీ బ్యూటీ నిత్యామీనన్ 'బ్రీథ్' అనే హిందీ వెబ్ సిరీస్ తో వచ్చింది. అభిషేక్ బచ్చన్ తో కలిసి చేసిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. మొదటి సీజన్ స్థాయిలో మెప్పించనప్పటికీ, ప్రేక్షకుల నుంచి పర్వాలేదనే ఫీడ్ బ్యాక్ అందుకుంది.

ఇదే క్రమంలో శృతి హాసన్ - ఈషా రెబ్బా - అమలా పాల్‌ 'పిట్టకథలు' అనే ఒరిజినల్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్ కు టాలీవుడ్ డైరెక్ట్స్ నాగ్ అశ్విన్ - నందిని రెడ్డి - తరుణ్ భాస్కర్ - సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వచ్చిన పిట్టకథలు ఆడియన్స్ ని నిరాశపరిచింది. 'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ 'అనగనగా ఓ అతిథి' సిరీస్ తో ఓటీటీలోకి వచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. అదే ఓటీటీలో మరో వెబ్ సిరీస్‌ చేసే అవకాశం కల్పించింది.

అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది. ఇది సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కు కొనసాగింపుగా వస్తోంది. ఈ సిరీస్ ను రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే రూపొందిస్తున్నారు. ఇందులో సమంత టెర్రరిస్టు పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సిరీస్ వాయిదా పడింది. అయితే త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి సమంత ఓటీటీ కంటెంట్ తో ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటదో చూడాలి.