Begin typing your search above and press return to search.

KGF రాఖీ భాయ్ తో శంక‌ర్? క‌లిపేది ఆయ‌నే!

By:  Tupaki Desk   |   24 Jun 2022 4:46 AM GMT
KGF రాఖీ భాయ్ తో శంక‌ర్? క‌లిపేది ఆయ‌నే!
X
KGF రాఖీ భాయ్ గా పాపుల‌ర‌య్యాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. ఒక బ‌స్ డ్రైవ‌ర్ కుమారుడిని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది కేజీఎఫ్ ఫ్రాంఛైజీ. దీనికి సృష్టిక‌ర్త ప్ర‌శాంత్ నీల్. ఇక ప్ర‌శాంత్ నీల్ స‌హా రాఖీ భాయ్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాత కం పంపిణీదారు దిల్ రాజు ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి.

దిల్ రాజు మాస్ట‌ర్ ప్లాన్ ఒక రేంజులో ఉంది. అది నేష‌న‌ల్ లెవ‌ల్లో ఢీకొట్టేలా ఉంద‌న్న గుస‌గుస ఇప్పుడు మ‌రోసారి స్ప్రెడ్ అవుతోంది. కేజీఎఫ్ స్టార్ య‌ష్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాల‌ని దిల్ రాజు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. కేజీఎఫ్ స‌క్సెస్ నేప‌థ్యంలో య‌ష్ పై ఆయ‌న పూర్తిగా దృష్టి సారించారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ బృందంతో పాన్ ఇండియా రేస్ లోకి వ‌చ్చిన దిల్ రాజు త‌దుప‌రి వెంట‌నే య‌ష్ తో సినిమా ప్రారంభించేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహం ర‌చించార‌ని తెలిసింది. మ‌రోవైపు త‌మిళ స్టార్ హీరో విజయ్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లితో చేస్తున్న‌ది కూడా పాన్ ఇండియా సినిమానే.

ప్ర‌స్తుతం అగ్ర హీరోల‌తో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా కేట‌గిరీలోనే విడుద‌ల‌వుతాయి. చ‌ర‌ణ్ ఆర్.సి 15 తెలుగు-హిందీ స‌హా తమిళం- క‌న్న‌డం- మ‌ల‌యాళంలో భారీగా విడుద‌ల‌వుతుంది.

అలాగే ద‌ళ‌ప‌తి విజ‌య్ -పైడిప‌ల్లి సినిమాని తెలుగు-త‌మిళంలో భారీగా విడుద‌ల చేస్తారు. హిందీ మార్కెట్ ని ఓవ‌ర్సీస్ ని దృష్టి లో పెట్టుకుని కంటెంట్ ని ప్రిపేర్ చేసార‌ని తెలిసింది. మ‌రోవైపు రాఖీ భాయ్ య‌ష్ తో సినిమా అంటే అది భాష‌తో సంబంధం లేనిది. అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతానికి య‌ష్ తో చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని తెలిసింది.

మ‌రోవైపు బాలీవుడ్ లో స‌క్సెస్ అందుకోవాల‌ని త‌ప‌న‌తో ప‌ని చేస్తున్న దిల్ రాజు జెర్సీ రీమేక్ .. హిట్ రీమేక్ ల‌తో బాలీవుడ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ దూసుకెళుతున్న‌ సంగ‌తి తెలిసిందే. జెర్సీతో ఆశించిన‌ది ద‌క్క‌లేదు. కానీ హిట్ రీమేక్ తో చాలా ఆశిస్తున్నారు. రాజ్ కుమార్ రావు న‌టించిన ఈ సినిమా జూలై 15న విడుద‌ల కానుంది. అయితే వీట‌న్నిటి కంటే దిల్ రాజు త‌దుప‌రి య‌ష్ సినిమాపై దృష్టి సారిస్తున్నార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే అత‌డితో మంత‌నాలు సాగించి డేట్లు లాక్ చేసార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. య‌ష్ ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రో పాన్ ఇండియా సినిమాకి సంత‌కం చేయ‌ని క్ర‌మంలో దిల్ రాజుతో ఆల్మోస్ట్ ఖాయ‌మైనట్టేన‌ని గుస‌గుస వినిపిస్తోంది. శంక‌ర్ తో సినిమా చేస్తున్న దిల్ రాజు ఒక‌వేళ ఆర్.సి 15 స‌క్సెసైతే త‌దుప‌రి య‌ష్ ని శంక‌ర్ తో క‌లుపుతార‌న్న గుస‌గుస కూడా వేడెక్కిస్తోంది. కానీ దీనికి ఇంకా అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ ఏదీ లేదు.