ఆఫర్లు లేక అందుకు సై అన్న షాలిని.. విజయ్ రికమెండేషనా?

Tue Oct 04 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Is Shalini Pandey to Act in Kushi Movie

షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అర్జున్ రెడ్డి' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన షాలిని పాండే.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ప్రీతి పాత్రను అద్భుతంగా పోషించి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. తన అమాయకపు చూపులు ఆకట్టుకునే అందం తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే షాలిని కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. 'అర్జున్ రెడ్డి' వంటి సూపర్ హిట్ అనంతరం షాలిని పాండే తెలుగుతో పాటు మలయాళం తమిళం హిందీ భాషల్లో నటించింది. కానీ ఎక్కడా స్టార్ హోదా ను అందుకోలేకపోయింది. కనీసం ఒక సూపర్ హిట్ ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయింది.

దీంతో ఈ అమ్మడి కెరీర్  చాలా స్లో అయిపోయింది. ఆఫర్లు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. టాలీవుడ్ లో అయితే షాలిని వైపే ఎవరూ చూడటం లేదు. పైగా కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్న షాలిని పాండే.. ఇటీవల బక్కచిక్కి జీరో సైజు కి మారింది. అయినా సరే ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

ఇక ఇలాంటి తరుణంలో షాలిని పాండే గురించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేమిటంటే ఆఫర్లు లేక ఈ భామ తాజాగా ఓ ఐటెం సాంగ్ చేసేందుకు సై అన్నదట. ఇంతకీ షాలిని ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో తెలుసా.. 'ఖుషి'. విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రమిది.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్  23న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ సాంగ్ కోసం విజయ్ స్వయంగా షాలిని పాండే ను రికమెండ్ చేశాడట.

దాంతో మేకర్స్ షాలిని పాండేను సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ఒకవేళ నిజంగానే 'ఖుషి' వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో షాలిని స్పెషల్ సాంగ్ చేసిందంటే.. ఆమె కెరీర్ కు ప్లాస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.