సామ్ ని ఇబ్బంది పెట్టిన ఆ ఇద్దరు ఎవరు?

Thu Oct 21 2021 12:03:15 GMT+0530 (IST)

Is Sam fighting for justice against those two?

పండ్లు ఉన్న చెట్టుకే  రాళ్లు అనే సామెత ఊరికే పుట్టలేదు. సమంతపై ట్రోలర్స్ ఎటాక్స్ విషయంలో తన అభిమానుల అభిప్రాయమిదే. సామ్ పై నిరంతరం ఏ రేంజ్ లో ఎటాక్ చేస్తున్నారో సోషల్ మీడియాలో చూస్తునే  ఉన్నాం. నాగచైతన్య-సమంత విడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ ఎటాక్ మొదలైంది. నాటి నుంచి సమంతనే టార్గెట్ చేసి ఒక సెక్షన్ నెలిజనం కామెంట్లు గుప్పిస్తున్నారు. అయితే వీటిని ఎంత మాత్రం పట్టించుకోకుండా సామ్ తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లిపోతోంది. సోషల్ మీడియా లో కామెంట్లకు..పోస్టులకు తాను ఎలాంటి రిప్లై ఇవ్వదలుచుకోలేదని క్లియర్ గా చెప్పేసింది. అయితే అతిగా ఓవర్ చేసిన కొన్ని యూట్యూబ్ చానళ్లపై మాత్రం సామ్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.వ్యక్తిగతంగా తన మనసుకు గాయం చేసింది ఆ రెండు యూట్యూబ్ ఛానెల్స్ అంటూ బహిర్గతం చేసి ఆమె పోరాటానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలింఫేర్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సామ్ ఆసక్తికరనమైన ప్రశ్న ఎదురైంది.  ఇంటర్వ్యూల్లో   అడిగే ప్రశ్నలు అంటే ఏవి ఇష్టం ఉండదని అడగగా...దానికి సామ్  హెడ్ లైన్ కోసం అడిగే ప్రశ్నలంటే చిరాకు అని తెలిపింది.  వాటిని అవమానకరమైన ప్రశ్నలుగా భావిస్తాను. ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడే నాకు సీన్ అర్ధమైపోతుంది. వాళ్ల ఇంటెన్షన్ ఏంటి?  నా ద్వారా ఎలాంటి నిజాలు రాబట్టడానికి  ప్రయత్నిస్తున్నారని.. ఇది కేవలం వారు హెడ్ లైన్ కోసమే అడుగుతుంటారు.

వృత్తిలో భాగమైనా మా మనసుల్ని నొప్పించే ప్రశ్నలు అని మాత్రం గ్రహించలేరు. ఇలాంటి ప్రశ్నలతో గేమ్ ఆడేవారు ఇద్దరు మాత్రమే ఉన్నారని సామ్ అంటోంది. మరి టాలీవుడ్ లో సామ్ ని ఇబ్బంది పెట్టే ఆ ఇద్దరు ఎవరో? అంటూ సందేహం మొదలైంది. సమంత తెలుగు సినీపరిశ్రమలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఇక్కడ మీడియాతోనే సామ్ అంత్యంత చనువుగాను మెలుగుతోంది. సమంత సినిమా జీవితమంతా తెలుగు సినిమా తోనే ముడిపడి ఉంది కాబట్టి..సామ్ ని ఇబ్బంది పెడుతూ ఇక్కడి వారినే ప్రస్థావించి ఉంటుందని భావిస్తున్నారు.

అలాగే సమంత గుణశేఖర్ దర్శరకత్వంలో `శాకుంతలం`లో  నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. కథ అంతా సమంత చుట్టూనే తిరుగుతుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికర ముఖ్య విషయాల్ని ఈ వేదికగా పంచుకుంది.

భవిష్యత్ రాక్ స్టార్ పైనా సామ్ ప్రశంసలు

ఇటీవల లైఫ్ డ్రామాలో ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు సమంత వరస విహారయాత్రలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి గోవా విహార యాత్రకు వెళ్లారు. తాజాగా తన స్నేహితురాలితో కలిసి డెహ్రాడూన్ లో విహారానికి వెళ్లిన సమంత తాజాగా ఓ స్టార్ కిడ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. శాకుంతలంలో తనతో కలిసి నటించిన బేబి అల్లు అర్హ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా సామ్ చెప్పారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ `శాకుంతలం` చిత్రంతో వెండితెరకు బాలనటిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అర్హపై చిత్రీకరణ సహా శాకుంతలం టాకీ చిత్రణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్హ నటనకు ముగ్ధురాలైన సామ్ తనపై ప్రశంసల వర్షం కురిపించింది. `అల్లు అర్హ జన్మతః రాక్ స్టార్ గా పుట్టిందని..తన తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుందని.. అలాంటి అర్హ నా సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుందని.. భవిష్యత్తులో అల్లు అర్హ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతుందని స్టార్ కిడ్ భవిష్యత్ ని చెప్పింది సామ్.