స్టార్ రైటర్ ని సల్మాన్ రౌండప్ చేస్తున్నాడా?

Wed Jun 29 2022 22:00:01 GMT+0530 (IST)

Is Salman Meeting Star Writer?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న 'కభీ ఈద్ కభీ దివాలీ' షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లో  ఉన్న సంగతి  తెలిసిందే. రాజమోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరగడంతో టీమ్ అంతా హైదరాబాద్ లో నే బస చేస్తోంది. సల్మాన్..హీరోయిన్ పూజాహెగ్డే లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసారు.సల్మాన్ పై ఇంకా కొన్ని బ్యాలెన్స్ సన్నివేశాలు ముగించే పనిలో టీమ్ బిజీగా ఉంది. అయితే  షూటింగ్ అంతా డే షేడ్యూల్ కావడంతో..సాయంత్రానికి టీమ్ ఫ్రీ అయిపోతుంది. మరి సాయంత్రం భాయ్ ఏం చేస్తున్నాడు? అంటే ఆసక్తికర సంగతి ఒకటి బయటకు వస్తుంది. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఆహ్వానించడంతో  సల్మాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో కమల్ హాసన్ సైతం చిరు ఇంట్లో ఉండటం.. సల్మాన్ అటెండెన్స్ తో ఆ  రోజు అలా గడిచిపోయింది. అటుపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆథిత్యం ఇచ్చినట్లు తెలిసింది. ఇలా సాయంత్రం అయ్యే సరికి సల్మాన్ టాలీవుడ్ లో ఏదో ఒక సెలబ్రిటీ ఇంట ఆతిధ్యం ఆస్వాదిస్తున్నారు. ఇంకా మరికొంత మంది సెలబ్రిటీలతో పబ్ ల్లో పార్టీలు..హంగామా చాలానే నడుస్తోంది.

ఇదే క్రమంలో సల్మాన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని వరుసగా రెండు రోజులు సాయంత్రం సమయంలో కలిసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇప్పుడీ అంశం ఇన్ సైడ్ హాట్ టాపిక్ గా మారింది.  భాయ్ ఇలా వరుసగా రెండు సాయంత్రాల మీటింగ్ వెనుక మర్మమేంటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోసారి ఈ ద్వయం సినిమా ప్లాన్ చేస్తుందా? అన్న  కారణం తెరపైకి వస్తోంది.

ఇప్పటికే పాన్ ఇండియా రైటర్ గా ఫేమస్ అయిన విజయేంద్ర ప్రసాద్ సల్మాన్ కోసం అలాంటి కథ సిద్దం చేయమని కోరారా? అని గుసగుస మొదలైంది. ఇప్పటికే సల్మాన్ కి స్టార్ రైటర్  'భజి రంగ్ భాయిజాన్' స్ర్కిప్ట్ అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల కనక వర్షం కురిపించింది. సల్మాన్ కెరీర్ లోనే అదొక మైల్ స్టోన్  మూవీగా పోయింది.

ఈ నేపథ్యంలోనే మరోసారి సల్మాన్ -విజయేంద్రుడి వెంట పడుతున్నాడా? అని ప్రచారం సాగుతోంది. అసలే బాలీవుడ్ లో సక్సెస్ రేట్ పడిపోయింది. కొంత కాలంగా హిందీ సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద రాణించని సంగతి తెలిసిందే. పేలవమైన కంటెంట్ తో తెలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సల్మాన్  - స్టార్ రైటర్ ని లైన్ లో పెడుతున్నాడని గట్టిగానే వినిపిస్తుంది.