Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న టాస్క్ కంప్లీట్ చేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   29 Nov 2022 7:53 AM GMT
జ‌క్క‌న్న టాస్క్ కంప్లీట్ చేసిన‌ట్టేనా?
X
రాజ‌మౌళి గ‌త కొన్ని రోజులుగా త‌ను తెర‌కెక్కించిన 'RRR' ని ఎలాగైనా ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల రేసులో నిల‌పాలని లాబీయింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ మూవీని రీసెంట్ గా జ‌పాన్ లో రిలీజ్ చేశారు. అక్క‌డ ప్ర‌మోష‌న్స్ కోసం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌తో క‌లిసి రాజ‌మౌళి జ‌పాన్ వెళ్ల‌డం.. అక్క‌డ ప్ర‌మోట్ చేయ‌డం.. అక్క‌డి మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడ‌టం తెలిసిందే. హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ జ‌పాన్ ప్రేక్ష‌కుల క్రేజ్ చూసి వారితో క‌లిసి సంద‌డి చేశారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ కావ‌డం తెలిసిందే. జ‌పాన్ లో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీకి అక్క‌డి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ 'బాహుబ‌లి' రికార్డుల్ని తిర‌గ‌రాసి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'ముత్తు' రికార్డుపై క‌న్నేసింది. ప్ర‌స్తుత జోరుని బ‌ట్టి ర‌జ‌నీ 'ముత్తు' రికార్డు కూడా తుడిచి పెట్టుకుపోవ‌డం గ్యారెంటీ అని తెలుస్తోంది. 38 రోజుల్లో రూ. 17 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

జ‌పాన్ లో మొత్తం 44 సిటీస్ లో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో అక్క‌డ 'RRR' స‌రికొత్త రికార్డుని నెల‌కొల్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే గ‌త కొన్ని రోజులుగా 'RRR' ఆస్కార్ నామినేష‌న్ కోసం భారీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్న రాజ‌మౌళి ఇందు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నార‌ని, ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

'RRR'ని అంత‌ర్జాతీయ వేద‌క‌ల‌పై హైలైట్ చేయ‌డం కోసం రాజ‌మౌళి ప‌లు ఫిల్మ్ ఫెస్టివెల్స్ లో పాల్గొంటూ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తూ వ‌స్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా లాస్ ఏంజిల్స్ లో వుంటూ 'RRR'ని హైలైట్ చేస్తూ ఓటింగ్ బ్యాచ్ ని ఇంప్రెస్ చేసే ప‌నిలో బిజీ బిజీగా గ‌డిపేసిన రాజ‌మౌళి ఎట్ట‌కేల‌కు త‌న టాస్క్ ని కంప్లీట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా రాజ‌మౌళి 'హిట్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా త‌ను చెప్పిన మాట‌లే ఇందుకు అద్దంప‌డుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజ‌మౌళి మాట్లాడుతూ చాలా రోజులు త‌రువాత తెలుగు మాట్లాడ‌టం ఆనందంగా వుంద‌న్నారు. గ‌త రెండు నెల‌లుగా రాజ‌మౌళి 'RRR' కోసం ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో హాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో ఇంగ్లీష్ తో మాట్లాడుతూ వ‌చ్చారు. రెండు నెల‌ల త‌రువాత తెలుగులో మాట్లాడ‌టం హ్యాపీగా వుంద‌ని జ‌క్క‌న్న అన‌డం వెన‌క అర్థం ఆస్కార్ బ‌రిలో 'RRR'ని నిల‌ప‌డం కోసం తాను వివిధ వేదిక‌ల‌పై ప‌లువురితో మాట్లాడిన టాస్క్ ఫైన‌ల్ గా పూర్త‌యింద‌ని.

వ‌చ్చే ఏడాది ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో 'RRR' ఎంట్రీ సాధించ‌డం కోసం ఎంత వ‌ర‌కు చేయాలో రాజ‌మౌళి అంత వ‌ర‌కు లాబీయింగ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. జ‌క్క‌న్న టాస్క్ ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే 2023 మార్చి 12 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.