Begin typing your search above and press return to search.

రామ్ అంతు చిక్కడా.. ఆయన మనసులో ఏముంది!

By:  Tupaki Desk   |   19 Oct 2020 9:30 AM GMT
రామ్ అంతు చిక్కడా.. ఆయన మనసులో ఏముంది!
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే కంప్లీట్ అయింది. వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకోగా కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. అయితే కరోనా ప్రభావం కొన్ని నెలల తరబడి ఉండడంతో ఆ సినిమాతో పాటు రెడీ అయిన వీ, నిశ్శబ్దం వంటి సినిమాలను ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్ల ఇప్పట్లో తేల్చుకోలేని పరిస్థితి ఉండడంతో రెడ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తారని అంతా భావించారు. కొందరు ఆ దిశగా ప్రయత్నించినా రామ్ ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను వెండితెరపైనే చూపించాలని రామ్ ఫిక్స్ అయిపోయాడు. దీంతో ఈ సినిమా నిర్మాత స్రవంతి రవికిషోర్ ఓటీటీ వైపు ఆలోచన లేదని స్పష్టం చేశాడు.

కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు తెరుచుకునే సరికి మరో మూడు 4 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ సినిమాలతో హిందీలో మార్కెట్ బాగా పెరగడంతో రామ్ ఇక తమిళ మలయాళ భాషల్లో పై దృష్టి పెట్టాడు. ఎలాగూ సమయం ఉండడంతో సినిమాని ఆ రెండు భాషల్లో విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ జరగకపోయినా స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కుల ద్వారా అయినా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా నిర్మాత ఇప్పటికే హిందీ డబ్బింగ్ హక్కులు, తెలుగు శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించినట్లు తెలుస్తోంది. అందుకే ఆలస్యమైనా సరే తెరపైనే ఈ సినిమాను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.