Begin typing your search above and press return to search.

ర‌ష్మిక ను ప్లాన్డ్‌ గానే ఇరికించారా?

By:  Tupaki Desk   |   22 Jan 2020 8:01 AM GMT
ర‌ష్మిక ను ప్లాన్డ్‌ గానే ఇరికించారా?
X
ఇటీవ‌ల స్టార్ల ఇళ్ల‌పై ఐటీ దాడుల ప్ర‌హ‌స‌నం తెలిసిందే. హీరోల‌తో పాటు హీరోయిన్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు జీఎస్టీ అధికారులు. మొన్న‌టికి మొన్న లావ‌ణ్య త్రిపాఠి ఇంటిపై ఐటీ దాడులు షాకిచ్చాయి. తాజాగా ర‌ష్మిక మంద‌న ఇంటిపై ఐటీ దాడుల‌తో సెల‌బ్రిటీ లోకం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఐదారు సినిమాల‌కే ఈవిడ‌పై ఐటీ దాడులా? అంటూ నోరెళ్ల‌బెట్టారు. అంతేకాదు.. త‌నపై ఏకంగా 250కోట్ల ఆస్తులు అంటూ క‌న్న‌డ మీడియా ప్ర‌చారం చేయ‌డంపై విడ్డూరంగా మాట్లాడుకున్నారు.

గ‌తంలో ప‌లువురు భామ‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రిగినా ఈ త‌ర‌హా ప్ర‌చారం అయితే సాగ‌లేదు. ప్ర‌స్తుతం ర‌ష్మిక ఆస్తుల విలువ 250 కోట్లు పైమాటే అంటూ క‌న్న‌డ మీడియా ప్ర‌చారం చేయ‌డం జోక్ గా మారింది. ఈ ఆస్తుల‌న్నీ ఐటీ అధికారుల ఆధీనంలో ఉన్నాయ‌న‌డం ఇంకా విడ్డూరంగా క‌నిపిస్తోంది. అస‌లు ఈ త‌ర‌హా ప్ర‌చారం వెన‌క ఏదైనా గూడుపుటానీ ఉందా? అంటూ కొంద‌రు ఆరాలు తీస్తున్నారు. ఇక ర‌ష్మిక విష‌యంలో క‌న్న‌డ మీడియా తొలి నుంచి నెగిటివ్ గానే ఉంది. వీలు దొరిక‌న‌ప్పుడ‌ల్లా ర‌ష్మిను బ్యాడ్ చేసే క‌థ‌నాలే వెలువ‌డ్డాయి.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చిన త‌న‌కు హీరో ర‌క్షిత్ శెట్టి అవ‌కాశ‌మిచ్చారు. ఆన్ సెట్స్ ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టం.. అటుపై పెళ్లికి సిద్ధ‌ మై నిశ్చితార్థం చేసుకోవ‌డం తెలిసిందే. ర‌క‌ర‌కాల మెలోడ్రామా అనంత‌రం ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో బ్రేక‌ప్ క‌థ‌నాలు ర‌ష్మిక ను..ఆమె కుటుంబాన్ని మాన‌సికంగా ఎంతో కుంగ‌దీసాయి. త‌న కుమార్తె ను ప్ర‌శాంతం గా జీవించ‌నివ్వండి అంటూ ర‌ష్మిక త‌ల్లి మీడియా ను వేడుకొంది. ఆ స‌మ‌యం లో ర‌క్షిత్ కూడా మాట స‌హాయం చేసాడు. అటుపై ర‌ష్మిక టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ల‌వ్ లో ఉంద‌ని క‌థ‌నాలు అంత‌కంత‌కు క‌న్న‌డ మీడియా స‌హా టాలీవుడ్ మీడియా ను వెడెక్కించాయి. అప్ప‌టి వ‌ర‌కూ తెలుగు మార్కెట్ వైపు చూడ‌ని ర‌క్షిత్ త‌ను న‌టించిన ఓ సినిమాను శ్రీమ‌న్నారాయ‌ణ టైటిల్ తో ఇక్క‌డా విడుద‌ల చేసాడు. దీంతో రష్మిక‌పై క‌క్ష‌తోనే ర‌క్షిత్ ఇక్క‌డా ఎంట్రీ ఇస్తున్నాడా? అన్న క‌థ‌నాలు వెడెక్కించాయి. మ‌రి తాజా వివాదాల‌కు.. హీరోగారికి ఏదైనా సంబంధ ఉందా? అంటూ ప‌లువురు సందేహం వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే ఎంత క‌క్ష క‌ట్టినా అన్ని కోట్లు ఎక్క‌డి నుంచి తేవాలి ర‌ష్మిక‌?