Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ చేయ‌బోతున్నాడా?

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:10 AM GMT
చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ చేయ‌బోతున్నాడా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మునుపెన్న‌డూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ చేయ‌బోతున్నారా? అంటే రామ్ చ‌ర‌ణ్ వేస్తున్న అడుగులని ప‌రిశీలిస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ పాన్ ఇండియా వండ‌ర్ 'RRR'. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీ త‌రువాత ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ సెమీ పీరియాడిక్ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

RC15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, ఆయ‌న సోద‌రుడు శిరీష్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం న్యూజీలాండ్ లో జ‌రుగుతోంది. రామ్ చ‌ర‌ణ్, కియారాల‌పై అక్క‌డ ఓ పాట‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. తండ్రిగా, త‌న‌యుడిగా రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్ ఇటీవ‌ల నెట్టింట సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించిన‌ రామ్ చ‌ర‌ణ్‌, అంజ‌లి లుక్ కి సంబంధించిన ఫొటోలు నెట్టింట లీకై వైర‌ల్ గా మారి సినిమాలో చ‌ర‌ణ్ ఓల్డ్ లుక్ ని బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇందులో చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ పై వ‌స్తున్న వార్త‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక మ‌రో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో త‌న‌యుడిగా క‌నిపించ‌బోతున్న లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసి సంద‌డి చేసింది. ఇదిలా వుంటే తాజాగా రామ్ చ‌ర‌ణ్ 'ఉప్పెన‌' ద‌ర్శ‌కుడితో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ నేప‌థ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో చేయాల‌ని ప్లాన్ చేశాడు. కానీ ఎన్టీఆర్ ఈ స్టోరీని రిజెక్ట్ చేయ‌డంతో అదే క‌థ‌ని బుచ్చిబాబు హీరో రామ్ చ‌ర‌ణ్ కు చెప్ప‌డం.. చ‌ర‌ణ్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం తెలిసిందే. మైత్రీ వారి స‌మ‌ర్ప‌ణ‌లో క‌లిసి వృద్ధి సినిమాస్, సుకుమార్ వ్రైటింగ్స్ బ్యాన‌ర్ లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌బోతున్నాయి. ఇందులోనూ రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు.

ఒక‌టి వీల్ చైర్ కు ప‌రిమిత‌మైన 60 ఏళ్ల వ‌య‌సున్న తండ్రి పాత్ర‌లో..మ‌రొక‌టి యుం క్రీడాకారుడిగా రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఇలా ఒకే స‌మ‌యంలో బ్యాక్ టు బ్యాక్ రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వెంట వెంట‌నే డ్యుయెల్ రోల్ స్క్రీప్ట్ ల‌తో రానున్న రామ్ చ‌ర‌ణ్ ఈ రెండు సినిమాల‌కు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని సొంతం చేసుకుని సరికొత్త మ్యాజిక్ ని చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ‌రి చ‌ర‌ణ్ ఆ మ్యాజిక్ చేస్తాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.