కొంపముంచిన విషెస్.. మౌనంలో సింగర్!

Sun May 24 2020 04:00:09 GMT+0530 (IST)

Is Rahul Sipligunj Got Married Singer Noel Wishes Goes Viral

తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య బిగ్ బాస్ రియాలిటీ షో తెగ పాపులర్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే అతను మంగమ్మ మాక్కికిరికిరి పాటలతో రెండు రాష్ట్రాలను ఊపేసాడు. అయితే బిగ్ బాస్ కంటే ముందు రాహుల్.. తెలుగు ప్రేక్షకులకు కేవలం ఒక సింగర్ గా మాత్రమే తెలుసు. కానీ బిగ్ బాస్ సీజన్లో పాల్గొని టైటిల్ విన్ అవ్వడంతో రాహుల్ సిప్లిగంజ్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా.. రాహుల్ సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటంటే.. ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా తన పెళ్లి చేసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.అయితే తాజాగా మరో టాలీవుడ్ యంగ్ ర్యాప్ సింగర్ నోయెల్ సీన్ కూడా రాహుల్ సిప్లిగంజ్ కి "హ్యాపీ మారీడ్ లైఫ్" తెలిపిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. ఈ దెబ్బతో రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరబ్బా? అంటూ ఆరా తీయడం మొదలైంది. అయితే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా.. రాహుల్ మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. కనీసం ఇప్పటికైనా రాహుల్ తన పెళ్లి విషయం పై స్పష్టత ఇవ్వాలని కొంతమంది అభిమానులు కోరారు. అయితే ఈ విషయం.. పక్కన పెడితే గతంలో రాహుల్ సిప్లిగంజ్ తో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొన్నటువంటి టాలీవుడ్ హీరోయిన్ పునర్నవి భూపాలంతో ప్రేమాయణం నడిపినట్లు పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి వార్తలపై పునర్నవి స్పందిస్తూ తాను రాహుల్ సిప్లిగంజ్ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. అంటూ సమాధానం ఇచ్చింది. ఎవరు స్పందించినా రాహుల్ నోరు మెదపక పోవడంతో అనుమానాలు కాస్త నిజాలేమో.. అంటూ నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.