అ! డైరెక్టర్ అక్కడ కూడా అడుగుపెడుతున్నాడా...?

Sat Jul 11 2020 09:15:47 GMT+0530 (IST)

Is Prashant Varma planning web series?

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'అ!' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్ర పోషించింది. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన 'అ!' సినిమా విమర్శకుల మెప్పు పొందడమే కాకుండా ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ సినిమా ఏకంగా రెండు జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రశాంత్ వర్మ రెండో ప్రయత్నంగా యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ తో 'కల్కి' సినిమా తెరకెక్కించారు. థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో వైవిధ్యమైన కథాంశంతో మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు ప్రశాంత్ వర్మ.ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పింట్లో పెట్టుకొని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రీ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు మంచి స్పందన తెచ్చుకుంది. తన రెండు సినిమాల్లోనూ డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం కరోనా విజృంభణను కూడా లెక్కచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా కాన్సెప్ట్ అండ్ టైటిల్ అనౌన్స్ చేస్తానని ఇప్పటికే యంగ్ డైరెక్టర్ అనౌన్స్ చేసారు.

ఇదిలా ఉండగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ త్వరలోనే వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడట. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టు అందరు దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ లని రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ సంకల్ప్ రెడ్డి నందినీ రెడ్డి వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా పలు వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వారితో రెండు వెబ్ సిరీస్ కోసం అగ్రిమెంట్ కూడా జరిగిందట. వీటికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నాడట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.