ప్రభాస్ యూవీ హోటల్స్ రాబోతున్నాయా..!

Wed Jul 06 2022 12:00:01 GMT+0530 (IST)

Is Prabhas UV Hotels are coming..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. సాహో మరియు రాధేశ్యామ్ నిరాశ పర్చినా కూడా ఆయన తదుపరి సినిమాలపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. సలార్.. ఆదిపురుష్.. ప్రాజెక్ట్ కే.. స్పిరిట్.. రాజా డీలక్స్ ఇలా అన్ని సినిమాలపై కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా హైప్ క్రియేట్ అయ్యింది.ఒక్కో సినిమాకు ప్రభాస్ వంద కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నాడు అంటూ మీడియా మరియు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. సినిమా పారితోషికం మాత్రమే కాకుండా తన సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్ లతో యూవీ క్రియేషన్స్ లో సినిమాలను నిర్మించడం ద్వారా కూడా ప్రభాస్ భారీగా లాభాలను దక్కించుకుంటున్నాడు అనేది టాక్.

మొత్తానికి సౌత్ స్టార్ హీరోల్లో అత్యధికంగా సంపాదన కలిగి ఉన్న హీరోగా ప్రభాస్ టాప్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్ లతో కలిసి వేరు వేరు రంగాల్లో బిజినెస్ ల్లో ప్రభాస్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విదేశాల్లో ముఖ్యంగా దుబాయ్ ఇంకా కొన్ని దేశాల్లో హోటల్ బిజినెస్ లో ప్రభాస్ అడుగు పెట్టాలని భావిస్తున్నాడట.

యూవీ వారి విదేశీ హోటల్ బిజినెస్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ లో వరుసగా భారీ చిత్రాలు మరియు చిన్న చిత్రాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఇదే సమయంలో వారు ప్రభాస్ తో కలిసి ఈ బిజినెస్ లో ఎంట్రీ అవ్వబోతున్నట్లుగా వారికి అత్యంత క్లోజ్ గా ఉండే కొందరు మీడియా వారు అనధికారికంగా చెబుతున్నారు.

ప్రభాస్ ఏ బిజినెస్ చేసినా కూడా వంశీ ప్రమోద్ లు ముందు ఉంటారు అనేది టాక్. కనుక ఈ హోటల్ బిజినెస్ లో ప్రభాస్ మెజార్టీ వాటా ను కలిగి ఉన్నా కూడా యూవీ వారి భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు. కనుక ప్రభాస్ యూవీ హోటల్స్ అతి త్వరలో దుబాయ్.. స్పెయిన్ ఇంకా కొన్ని చోట్ల రాబోతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక ప్రభాస్ మొదటి హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో రాజా డీలక్స్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంతే కాకుండా త్వరలోనే స్పిరిట్ వర్క్ కూడా మొదలు అవ్వబోతుందట.