Begin typing your search above and press return to search.

ఆ విషయంలో పవర్ స్టార్ బాలయ్యను ఫాలో అవుతున్నాడా..??

By:  Tupaki Desk   |   6 March 2021 12:36 PM GMT
ఆ విషయంలో పవర్ స్టార్ బాలయ్యను ఫాలో అవుతున్నాడా..??
X
సినీహీరోలకు వారి అభిమానులకు కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ గాని సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్ లేదా కొన్ని పర్టికులర్ స్పెషల్ మార్క్ సీన్స్ ఉంటాయి. అభిమానులు ఫస్ట్ ఏ హీరో నుండి ఎలాంటి స్పెషల్ మూమెంట్ లైక్ చేస్తారో అది ప్రతి సినిమాలో ఉండేలా కోరుకుంటారు. అలాగే ఫ్యాన్స్ కూడా తమ హీరో నుండి ఇంకా ఆ డైలాగ్, ఆ సీన్ రాలేదేంటా అని ఎదురుచూస్తుంటారు. తెలుగు స్టార్ హీరోలలో ఒక్కో హీరోకు ఒక్కో స్పెషల్ మార్క్ ఉంది. అయితే విక్టరీ వెంకటేష్ చేయి చూపించి మాట్లాడటం ఒక స్టైల్ అయితే, పవన్ కళ్యాణ్ కాలర్ పై చేయివేసి డైలాగ్ కొట్టడం స్పెషల్.. అలాగే నందమూరి హీరోలలో తొడకొట్టి డైలాగ్ కొట్టడం స్పెషల్.

అలా కొందరు హీరోలు తమ అభిమానుల కోసం ఇలాంటి సిగ్నేచర్ సీన్స్ సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ ఒక్కోసారి వేరే హీరోలు కూడా ఆ మూమెంట్స్ ఫాలో అయిపోతుంటారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో తొడకొట్టి హిట్టు కొట్టాడు. అలాగే అల్లరి నరేష్ సుడిగాడు సినిమాలో తొడకొట్టాడు కానీ అది కామెడీ వెర్షన్ లో.. అయితే ఇప్పుడు సీరియస్ గానే ఓ హీరో బాలయ్య తొడకొట్టే సీన్ చేయనున్నాడని టాక్. ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరహరవీరమల్లు(నామమాత్రం) అనే సినిమాలో తొడకొట్టి డైలాగ్ చెప్పినట్లు సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మార్చ్ 11న పవన్ - క్రిష్ సినిమాల టీజర్ తో పాటు టైటిల్ రివీల్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే అంచనాలు భారీ లెవెల్లో నెలకొనగా.. ఈ విషయం తెలిసేసరికి పవన్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. చూడాలి మరి పవన్ ఫ్యాన్స్ తొడకొట్టే సీన్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..!