Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ - ప్ర‌భాస్ మ‌ల్టీస్టార‌ర్ పాజిబులేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:02 AM GMT
ప‌వ‌న్ - ప్ర‌భాస్ మ‌ల్టీస్టార‌ర్ పాజిబులేనా?
X
టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఫ్యాన్ వార్ అనేది ఎప్పుడూ ఉండేదే. కానీ ఇటీవ‌లి కాలంలో వైరానికి అతీతంగా స్టార్లంతా ఒక‌రితో ఒక‌రు క‌లిసిపోయి ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటూ పాన్ ఇండియా హిట్లు కొట్టాల‌ని త‌పిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక‌పోతే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య భీమ‌వ‌రం స‌హా ప‌.గో జిల్లాలో ఫ్యాన్ వార్ గురించి తెలిసిందే. ఒకానొక‌ప్పుడు 144 సెక్ష‌న్ విధించాల్సొచ్చిందంటే అర్థం చేసుకోవాలి.

అయితే దీన‌ర్థం ప‌వ‌ర్ స్టార్ అంటే రెబ‌ల్ స్టార్ కి కోప‌మా? ప‌గ ప్ర‌తికార‌మా? అంటే అబ్బే అలాంటివేవీ వీళ్ల మ‌ధ్య ఉండ‌వు. అవి అభిమానుల్లో ఒక సెక్ష‌న్ సృష్టించే రాజ‌కీయ ప‌న్నాగాలుగానే చూడాల్సి ఉంటుంద‌ని చాలా సంద‌ర్భాల్లో ప్రూవ్ అయ్యింది. అది ఒక ఎమోష‌న‌ల్ ఘ‌ట్టంగా మాత్ర‌మే చూడాలి.

ప‌వన్ విజ‌యం సాధిస్తే ప్ర‌భాస్ అభినందిస్తాడు. ప్ర‌భాస్ విజ‌య‌శిఖ‌రాల్ని అధిరోహిస్తే ప‌వ‌న్ దానిని ఆస్వాధిస్తాన‌ని అంటాడు. అలాంటి స్నేహానుబంధం వారి మ‌ధ్య ఉంది. కానీ ఫ్యాన్స్ మ‌ధ్య అనూహ్య గ‌డ‌బిడ దేనికోసం? అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాదని కొంద‌రు విశ్లేషిస్తుంట‌రు.

ఇప్పుడు సాహో ఫేం సుజీత్ కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌భాస్ న‌టించిన భారీ చిత్రం సాహో ఫ్లాపైనా టెక్నిక‌ల్ గ్లింప్స్ పై ప్ర‌శంస‌లు కురిసాయి. ఒక్క సినిమా కిడ్ ఇంతటి భారీ సినిమాని ఎలా హ్యాండిల్ చేసాడు? అన్న సందేహాలు అంద‌రికీ ఉన్నాయి. కానీ సుజీత్ అసామాన్యుడు! అని నిరూపిస్తూ ఇప్పుడు ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనే సినిమాని లాంచ్ చేయించాడు.

ప‌వ‌న్- సుజీత్ కాంబినేష‌న్ లో డీవీవీ దాన‌య్య నిర్మించే సినిమా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా పవర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ‌జేసారు. సాహూ- రన్ రాజా రన్ చిత్రాల‌ దర్శకుడు సుజీత్ తో పవర్‌స్టార్ అరుదైన క‌లయిక స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది.

ఈ సినిమా ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ కాంబినేషన్ తో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రకటన వెలువ‌డిన నిమిషాల్లోనే అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. వారంతా పోస్టర్‌ను డీకోడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ లో పవర్ స్టార్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవన్- సుజీత్ ల తొలి క‌ల‌యిక‌పై అభినందనలు తెలిపిన ఆయన ఈ కాంబినేషన్ బిగ్ బ్యాంగ్‌గా అల‌రించ‌బోతోందని అన్నారు.

నిర్మాత డివివి దానయ్యతో పాటు టీమ్ మొత్తానికి ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ప్రభాస్‌ ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రభాస్ నుండి ప‌వ‌ర్ స్టార్ కి శుభాకాంక్షలు అంద‌డం చూశాక ఫ్యాన్స్ లో ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇరువురు అగ్ర హీరోల న‌డుమ స్నేహానుబంధం ఇలానే కొన‌సాగాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ప‌వ‌న్ - ప్ర‌భాస్ క‌లిసి ఒక మ‌ల్టీస్టార‌ర్ ల న‌టిస్తే అది పాన్ ఇండియా లెవ‌ల్లో మ‌రో రేంజు కు చేరుకుంటుంద‌ని కూడా కొంద‌రు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.