Begin typing your search above and press return to search.

నివేదా పేతురాజ్ కి మిగిలింది నిరాశేనా?

By:  Tupaki Desk   |   15 Jan 2021 8:30 AM GMT
నివేదా పేతురాజ్ కి మిగిలింది నిరాశేనా?
X
నివేదా పేతురాజ్ .. నిలువెత్తు అందమైన రూపం .. కుర్రాళ్లకు అపురూపం. మంచి హైటు .. పర్సనాలిటీతో ఈ అమ్మాయి పడగొట్టేస్తుంది. 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' సినిమాలతో కుదురుకుంటూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సుందరి 'రెడ్' సినిమాలో అవకాశాన్ని కొట్టేసింది. పెద్ద బ్యానర్ .. స్టార్ హీరో .. క్రేజ్ ఉన్న దర్శకుడు .. పైగా చేసేది పోలీస్ ఆఫీసర్ పాత్ర. దాంతో ఇక ఈ సినిమాతో ఈ అమ్మాయి దశ తిరగడం ఖాయమని అంతా అనుకున్నారు. ఇన్నాళ్లకు ఈ అమ్మాయికి సరైన పాత్ర పడిందని చెప్పుకున్నారు.

తెలుగు తెరపై లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చాలామంది కథానాయికలు నటించారు. కానీ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర అనగానే శారద .. విజయశాంతి మాత్రమే ప్రేక్షకులకు గుర్తొస్తారు. అందుకు కారణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాళ్ల హైట్. నివేదా పేతురాజ్ కూడా మంచి పొడగరి కావడంతో, పోలీస్ ఆఫీసర్ గా ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఈ పాత్ర ఆమె కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకున్నారు. కానీ తెరపై ఆ స్థాయిలో ఆమె కనిపించకపోవడం అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. నివేదా పేతురాజ్ పాత్ర డైనమిక్ గా లేకపోవడంతో వాళ్లంతా పెదవి విరుస్తున్నారు.

పోలీస్ ఆఫీసర్ పాత్రను దర్శకుడు కిషోర్ తిరుమల సరిగ్గా మలచకపోవడం వలన, తెరపై నివేదా పేతురాజ్ తేలిపోయిందని అంటున్నారు. ఆమె పాత్రను డిజైన్ చేసే తీరుపై మరికొంత దృష్టి పెట్టేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ పాత్రకి నివేదా పేతురాజ్ ఎంపిక సరైనదే. అయితే ఆ పాత్రను తీర్చిదిద్దే విషయంలోని లోపం కారణంగా, ఆమెను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. అందువలన ఆశించిన స్థాయిలో నివేదా పేతురాజ్ ఆకట్టుకోలేకపోయింది. ఇది ఆమెకే కాదు .. ఆమె అభిమానులకు కూడా నిరాశను కలిగించే విషయమే.