Begin typing your search above and press return to search.

ఫామ్‌ హౌస్‌ కు మారిన నయన్‌ పెళ్లి రూమర్స్‌

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:30 AM GMT
ఫామ్‌ హౌస్‌ కు మారిన నయన్‌ పెళ్లి రూమర్స్‌
X
కోలీవుడ్‌.. టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా గత దశాబ్ద కాలంగా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ నయనతార పెళ్లి విషయం ఈమద్య కాలంలో ఎప్పుడు ట్రెండ్డింగ్‌లోనే ఉంటుంది. ఈ అమ్మడు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లి విషయంలో వీరిద్దరు కూడా ప్రస్తుతం ఆసక్తిగా లేరని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లికి వీరు రెడీ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి విషయంలో గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు ఆలోచన లేదు. అందుకే పెళ్లి అయిన తర్వాత కూడా హీరోయిన్‌ గా నయన్‌ బిజీగా ఉండవచ్చు అనుకుంటుందట.

ఆమద్య కొద్ది మంది సమక్షంలో తమిళనాడులోని ఒక గుడిలో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అది నిజం కాదని తేలిపోయింది. పెళ్లి కోసం ప్రస్తుతం చెన్నై సమీపంలోని ఒక ఫామ్‌ హౌస్‌ రెడీ అవుతుందని అంటున్నారు. విఘ్నేష్‌ శివన్‌ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఈ పెళ్లి ఏర్పాటు చేస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని వారాల్లోనే వీరి పెళ్లి ఉంటుందని.. అతి తక్కువ మంది జనాల ఆధ్వర్యంలో ఈ పెళ్లి వేడుక నిరాడంబరంగా సాగబోతుందని సినీ వర్గాల వారిలో కూడా టాక్‌ వినిపిస్తుంది. ఇలాంటి పెళ్లి వార్తలు చాలానే వచ్చాయి. కనుక ఈసారి అయినా నిజమేనో కాదో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.