Begin typing your search above and press return to search.

V లో ప్రేక్షకులకు పెద్ద సర్ ప్రైజ్ అదేనా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 5:30 PM GMT
V లో ప్రేక్షకులకు పెద్ద సర్ ప్రైజ్ అదేనా?
X
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని.. సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'V'. ఈ సినిమాలో సుధీర్ బాబు.. నాని పాత్రల ఫస్ట్ లుక్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. సుధీర్ బాబును 'రక్షకుడు' అని.. నానిని 'రాక్షసుడు' అని పరిచయం చేశారు. ఇది మొదటి నుంచి ప్రచారంలో ఉన్న విషయమే. నాని ఈ సినిమాలో తొలిసారిగా విలన్ పాత్రలో నటిస్తున్నారని.. సుధీర్ బాబు హీరో అని అన్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా దీనిప్రకారమే సాగుతున్నాయి.

అయితే ఇదంతా తూచ్ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో నాని విలన్.. సుధీర్ హీరో అనేది నిజం కాదని ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు దిల్ రాజు టీమ్.. డైరెక్టర్ ఇంద్రగంటి కలిసి ఇలా స్పెషల్ గా పబ్లిసిటీ ప్లాన్ చేశారట. నిజానికి ఈ సినిమాలో నాని.. సుధీర్ పాత్రలు రివర్స్ లో ఉంటాయని సమాచారం. సింపుల్ గా చెప్పుకుంటే నాని మొదట్లో విలన్ లాగా కనిపించినా చివరికి హీరోగా మారతాడని.. సుధీర్ మొదట్లో హీరోగా కనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ గా మారిపోతాడని అంటున్నారు.

ఇలా అయితే ఈ సినిమాలో ఎవరూ హీరో కాదు.. ఎవరూ విలన్ కాదు అని వాదించవచ్చు. ఒకరకంగా ఆలోచిస్తే అదీ లాజిక్కే. ఏదైతేనేం.. ఈ సినిమాలో నాని.. సుధీర్ ఇద్దరూ తమ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులకు ఎంతమాత్రం నచ్చుతాయో వేచి చూడాలి.