Begin typing your search above and press return to search.

'స్పిరిట్' లో కియారా? గుట్టు విప్పేసిన బ్యూటీ!

By:  Tupaki Desk   |   16 May 2022 3:30 PM GMT
స్పిరిట్ లో కియారా? గుట్టు విప్పేసిన బ్యూటీ!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ వంగ ద‌ర్శ‌క‌త్వంలో 'స్పిరిట్' అనే చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ తో మ‌రోపాన్ ఇండియా చిత్రానికి ఈ ద్వ‌యం శ్రీకారం చుట్టింది. ఈ సినిమా ప్ర‌క‌ట‌న‌తోనే కాంబినేష‌న్ పై అంచ‌నాలు పీక్స్ కి చేరుకున్నాయి.

'స్పిరిట్' కి..ప్ర‌భాస్ క‌టౌట్ కి ఎలా మ్యాచ్ అవుతుందంటూ చాలా సందేహాలే నాటి నుంచి వెంటాడుతున్నాయి. కంటెంట్ ఏంట‌న్న‌ది అర్ధంకాని సందిగ్ధత‌ ఏర్ప‌డింది. కానీ ప్ర‌భాస్ రోల్ పై మాత్రం క్లారిటీ వ‌చ్చింది. ఇందులో డార్లింగ్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని స‌మాచారం. పోలీస్ పాత్ర అన్న‌ది డార్లింగ్ డ్రీమ్ రోల్.

ఇలాంటి పాత్ర పోషించాల‌ని డార్లింగ్ ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నాడు. 'స్పిరిట్' తో ఆ క‌ల నెర‌వేర‌బోతుంది. ఈ నేప‌థ్యంలో డార్లింగ్ స‌ర‌స‌న స‌రిగ్గా బాలీవుడ్ హీరోయిన్ కియా అద్వాణీ మ్యాచ్ అవుతుంద‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కియారా ఎంపిక ఖ‌రారైందంటూ జాతీయ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ గా మారాయి. అయితే ఈ ప్ర‌చారాన్ని కియారా ఖండించింది.

దీనికి సంబంధించి కియారా ప్ర‌తినిది ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ''ప్ర‌భాస్ హీరోగా సందీప్ వంగ తెర‌కెక్కిస్తున్న స్పిరిట్ సినిమా గురించి..అందులో కియారా ఎంట్రీ గురించి వ‌స్తోన్న క‌థ‌నాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నాం.

స్పిరిట్ సినిమా కోసం కియారాని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు. కియారా-స్పిరిట్ టీమ్ మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు. మీడియాలో వ‌స్తోన్నవ‌న్ని త‌ప్పుడు క‌థ‌నాలు. అలాంటి అప్టేడేట్ ఉంటే ముందుగా మీడియాకే వెల్ల‌డిస్తామ‌ని'' తెలిపారు.

ప్ర‌స్తుతం కియారా అద్వాణీ 'భూల్ భుల‌య్యా-2' సినిమా ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తుంది. ఇంకా బాలీవుడ్ లో కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఇక ప్ర‌భాస్ 'స‌లార్' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చిదిద్దుతున్నారు. సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి.