'ఖుషీ' అక్కడ రిలీజ్ లేదా?

Mon May 16 2022 15:10:50 GMT+0530 (IST)

Is 'Khushi' not releasing there?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండేళ్ల తరువాత స్పీడు పెంచాడు. కరోనా కారణంగా కేవలం ఒకే ఒక్క సినిమాకు స్టికాన్ అయిపోయిన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన బాక్సింగ్ డ్రామా 'లైగర్' షూటింగ్ పూర్తయిపోవడంతో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలను లైన్ లో పెట్టేశాడు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' చిత్రాన్ని ఇటీవలే విజయ్ దేవరకొండ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఓ షెడ్యూల్ పూర్తి చేసి శివ నిర్వాణతో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.

క్రేజీ లేడీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి 'ఖుషీ' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మేకర్స్ ఇదే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో పఠాన్ డ్రెస్ ని పోలిన కాస్ట్యూమ్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తుండగా సమంత సంప్రదయబద్ధంగా హిందూ యువతిగా కనిపిస్తోంది. ఇద్దరికి బ్రహ్మముడి వేయడం అపోజిట్ గా తిరిగి వున్న సామ్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం... మధ్యలో శాంతికి గుర్తుగా పావురాలు ఎగుతుండటం.. పింక్ కలర్ లో కశ్మీర్ మ్యాప్ కనిపించడం ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామంటూ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్పడ భాషల్లో మాత్రమే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై వెల్లడించారు. హిందీలో ఎందుకు విడుదల చేయడం లేదన్నది ఇప్పడు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ముంబై స్లమ్ ఏరియా ఛాయ్ వాలా ఎలా ఇంటర్నేషన్ లెవెల్ చాపింయన్ అయ్యాడనే కథ కథనాలతో ఈ మూవీని రూపొందించారు. తెలుగు తో పాటు ఈ మూవీ తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

మరి 'ఖుషీ' మూవీని మాత్రం హిందీలో ఎందుకు రిలీజ్ చేయడం లేదు. ఇది పాన్ ఇండియా స్థాయి సబ్జెక్టే. రొమాంటిక్ లవ్ స్టోరీని చూపిస్తూనే 'రోజా' తరహాలో కశ్మీర్ విదాదాన్ని కూడా ఈ చిత్రంలో చర్చస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ఈ మూవీని హిందీలో ఎందుకు డబ్ చేయాలనుకోవడం లేదన్నది ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కావాలనే మేకర్స్ హిందీ రిలీజ్ ని పక్కన పెట్టారా?  లేక నాలుగు భాషల్లో రిలీజ్ తరువాత హిందీలో రిలీజ్ చేస్తారా? అన్న విషయంలో మాత్రం స్పష్టతలేకపోవడం గమనార్హం.