కాజల్ అగర్వాల్ మొదటి బిడ్డను ఆశిస్తోందా?

Tue Sep 14 2021 13:01:30 GMT+0530 (IST)

Is Kajal Agarwal expecting her first child

చందమామ కాజల్ అగర్వాల్ గర్భవతి! ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుస ఇది. అందుకే ఇటీవల కాజల్ సరిగా సోషల్ మీడియాల్లో కనిపించడం లేదు. షూటింగుల్లేకుండా ఖాళీగా ఉంది.. అంటూ ఒకటే ప్రచారం సాగుతోంది. కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డను ఆశిస్తోందని కథనాలొస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.36 ఏళ్ల కాజల్ సౌత్ లో అగ్ర కథానాయిక హోదాని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా ఎదురే లేని లైనప్ తో ఉంది. ఇంతలోనే తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. ఈ జంట 30 అక్టోబర్ 2020న వివాహం చేసుకున్నారు.

చిన్న విరామం తర్వాత కాజల్ సినిమా ప్రపంచంలోకి తిరిగి వచ్చి పనిచేయడం ప్రారంభించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య` లో నటిస్తున్న కాజల్ తన షెడ్యూల్స్ ని ఇప్పటికే ముగించింది. ప్రస్తుతం నాగార్జున అక్కినేని నటించిన `ది ఘోస్ట్` షూటింగ్ లో ఉంది. ఇక పై నటనకు పూర్తిగా విరామం ఇవ్వనుందని .. త్వరలోనే తన నుంచి మొదటి బిడ్డను ఆశించవచ్చని కథనాలు వస్తున్నాయి.

RAA ఏజెంట్ గా కాజల్ స్టంట్స్

ప్రవీణ్ సత్తారు మూవీలో RAA ఏజెంట్ గా నాగ్ కనిపిస్తారని గుసగుసలు వినిపించాయి. నాగార్జునతో పాటు ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ కాజల్ ప్రీ-లుక్ పోస్టర్ ను విడుదల చేయగా స్పందన బావుంది. ఇటీవల కాజల్ ఆన్ లొకేషన్ నుంచి షేర్ చేసిన ఫోటోలో తన లుక్ ఎంతో లైవ్ లీగా కనిపిస్తోంది. తుపాకీతో రా ఏజెంట్ గెటప్ లో కనిపించిన కాజల్ మైండ్ బ్లాక్ చేసింది. డార్క్ లైట్ షూటింగ్ అది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. కాజల్ ఈసారి రొటీన్ కి భిన్నంగా నటనకు ఆస్కారం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తోంది. కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29 న ఈ టీమ్ నాగ్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కమర్షియల్ ఎంటర్ టైనర్ ల స్పెషలిస్ట్ ప్రవీణ్ సత్తారు ఈసారికూడా మరో అద్భుతమైన స్క్రిప్ట్ ని రాశారు. నిర్మాతలు దీనిని భారీ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి అవసరమైన బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP - నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్ .. అనిఖా సురేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ.. బ్రహ్మ కడలి కళా దర్శకత్వం ప్రధాన అస్సెట్స్. రాబిన్ సుబ్బు- నభా మాస్టర్ తదితర అత్యున్నత సాంకేతిక బృందం ఈ చిత్రం కోసం పనిచేస్తోంది.