Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ స్టార్‌ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌ నిజమేనా?

By:  Tupaki Desk   |   7 Oct 2022 11:30 AM GMT
కేజీఎఫ్‌ స్టార్‌ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌ నిజమేనా?
X
కేజీఎఫ్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్న నటుడు యశ్‌. అద్భుతమైన నటనతో తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న యశ్‌ తదుపరి సినిమా విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ కి ముందు కన్నడ సినిమా పరిశ్రమ కేజీఎఫ్ తర్వాత కన్నడ సినీ పరిశ్రమ అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఇప్పుడు కన్నడ సినిమా స్థాయిని మరింతగా పెంచేందుకు యశ్‌ ప్రయత్నిస్తున్నట్లుగా తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

అమెరికన్ ప్రముఖ దర్శకుడు జే జే ఫెర్రీ తో యశ్ ను చూడటం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందంటూ కన్నడ సినీ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా స్టంట్స్ మ్యాన్‌.. మార్షల్ ఆర్ట్స్‌ ఆర్టిస్ట్‌ కూడా. అతడితో యశ్‌ ని చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ రాబోతుందని అనిపిస్తుందంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

యశ్ మరియు ఫెర్రీ లతో పాటు ఫార్ములా 1 రేసింగ్ లెజెండ్‌ లూయిస్ హామిల్టన్ కూడా వారితో కనిపించారు.

ఈ ముగ్గురు కలయిక సాదారణంగా జరిగిందా లేదంటే ఏదైనా అసాధారణం జరుగబోతుందా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ విషయమై చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ తర్వాత యశ్‌ ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఆ సమయం వచ్చిందా అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.