చరణ్..ఎన్టీఆర్ మధ్య నలిగిపోతున్న జాన్వీ!

Fri Dec 02 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Is Janhvi Kapoor to Act in NTR or RamCharan Film

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె సౌంత్ ఎంట్రీ కోసం ఎంతో  ఎగ్టైట్ మెంట్ తో ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. తండ్ఇ బోనీ కపూర్ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వాలి గానీ వచ్చి వాలిపోవడానికి రెడీగా ఉంది. సరైన కథ..హీరో దొరికితే? లాంచ్ అవ్వడమే ఆలస్యం అన్న చందంగా జాన్వీ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే కొందరు హీరోల పేర్లు కూడా సూచించింది.యంగ్ టైగర్  ఎన్టీఆర్...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పని చేయాలని ఉందని ఉత్సాహాన్ని చూపించింది. అలాంటి ఆఫర్ కోసం  వెయిట్ చేస్తోంది. ఇప్పటికే 'జగదీక వీరుడు అతిలోకసుందరి' సినిమా రీమేక్ చేస్తే గనుక అందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ మాత్రమే నటించాలని ఓ శాసనమే చేసేసారు. అప్పట్లో చిరంజీవి-శ్రీదేవి..ఇప్పట్లో చరణ్-జాన్వీ అని అభిమానులు సైతం మైండ్ ఫిక్స్ చేసి పెట్టారు.

ఇక యంగ్ టైగర్ కి జాన్వీ  పర్పెక్ట్ జోడీగా నిలుస్తుంది. ఈ పెయిర్ సైతం తెరపై అందంగా ఆవిష్కరించవచ్చు అన్నది మేకర్స్  ప్లాన్.  టైగర్ తో బుచ్చిబాబు సినిమా గనుక  లాక్ అయితే అందులో జాన్వీని తీసుకుంటారని ప్రచారం సాగింది. బుచ్చిబాబు కథకి సైతం జాన్వీ పక్కాగా యాప్ట్ అవుతుందని విశ్లేషణ తెరపైకి వచ్చింది. కట్ చేస్తే అదే స్టోరీ ఇప్పుడు రామ్ చరణ్ వద్దకు వెళ్లింది.

తారక్ స్థానంలో చరణ్ ఉన్నాడు. ఇప్పుడు జాన్వీని గనుక బుచ్చి బాబు తీసుకోవాలనుకుంటే?   నారీ నారీ నడుము మురారీ అన్న చందంగా సీన్ కనిపిస్తుంది.  ఎందుకంటే ఎన్టీఆర్  30వ చిత్రానికి జాన్వీ కపూర్ ని తీసుకోవాలని దర్శకుడు కొరటాల కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అలియాభట్ ఎగ్జిట్ అయిన నేపథ్యలో ఆస్థానానికి జాన్వీ మాత్రం న్యాయం చేస్తుందని  ఆయన భావిస్తున్నారు.

ఆ రకంగా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా జాన్వీకి రెండు అవకాశాలు వరించినట్లే. ఒకే సారి  చరణ్..ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే అరుదైన అవకాశం దక్కినట్లే ఈ నారికి. ఇద్దరి లో ఎవరు ఫస్ట్  ఛాయిస్ వంటివి  ఎంపికలు వచ్చినప్పుడు రివీల్ చేయడంలో ఒత్తిడి తప్పదు. ఆ  సన్నివేశం కత్తి మీద సాములాగే ఉంటుంది. నారి నలిగిపోవాల్సిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.