Begin typing your search above and press return to search.

జక్కన్న మరోసారి పునర్జన్మల నేపథ్యాన్ని టచ్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   24 July 2021 2:30 AM GMT
జక్కన్న మరోసారి పునర్జన్మల నేపథ్యాన్ని టచ్ చేస్తున్నారా..?
X
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్ ఆర్ ఆర్'' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ డేట్ ని టార్గెట్ పెట్టుకొని శరవేగంగా పెండింగ్ వర్క్ షూట్ చేస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్న RRR టీమ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే 'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి ఉన్న బజ్ దృష్ట్యా అనేక రూమర్స్ - ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ట్రిపుల్ ఆర్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో జక్కన్న పునర్జన్మల నేపథ్యాన్ని టచ్ చేస్తున్నారట. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కలసి పోరాడితే ఎలా ఉంటుందనే కల్పిత కథతో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా RRR రూపొందుతున్న సంగతి తెలిసిందే. భీమ్ గా ఎన్టీఆర్ - రామరాజు గా చరణ్ నటిస్తున్నారు.

అయితే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో బ్రిటీష్ వారిపై పోరాడిన చరణ్ - తారక్ పాత్రలు చివరకు చనిపోతాయట. మళ్ళీ జన్మించిన వీరిద్దరూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కలుసుకునేలా రాజమౌళి ప్లాన్ చేసారట. ఇందులో ఇద్దరి పాత్రల మధ్య స్నేహాన్ని హైలైట్ గా చూపించబోతున్నారట. అందుకే పునర్జన్మల నేపథ్యాన్ని తీసుకొని మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్ షిప్ చేసేలా సినిమాని ఎండ్ చేయబోతున్నారట. ఇది RRR లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్ ఉంది.

రాజమౌళి గతంలో 'మగధీర' 'ఈగ' వంటి చిత్రాలలో పునర్జన్మల కాన్సెప్ట్ ని చూపించారు. ఈ క్రమంలో 'ఆర్ ఆర్ ఆర్' లో కూడా అదే నేపథ్యాన్ని చూపిస్తారో లేదో తెలియాలంటే విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా, RRR చిత్రంలో అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.