ఇజ్రాయేలీ అందం టాలీవుడ్ ని షేక్ చేయబోతోందా?

Sat Jan 23 2021 10:40:51 GMT+0530 (IST)

Is Israeli beauty going to shake up Tollywood?

విదేశీ అందగత్తెలు భారతీయ సినీపరిశ్రమల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలీవుడ్ సహా కోలీవుడ్ లోనూ పలువురు విదేశీ భామలు నటించారు. నోరా ఫతేహి.. ఎమీజాక్సన్.. గాబ్రియేలా.. ఇలా పలువురు భామలు ఐటెమ్ భామలుగా ఇక్కడ సత్తా చాటడమే గాక నటీమణులుగానూ రాణిస్తున్నారు.ఇదే బాటలో మరో విదేశీ భామ హిందీ పరిశ్రమ సహా సౌత్ లోనూ పాపులరయ్యేందుకు ఛాన్సుందన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరీ భామ అంటే.. ఇజ్రాయెల్ కు చెందిన 19ప్రాయం మోడల్ యాయెల్ షెల్బియా. TC కాండ్లర్ 100 అత్యంత అందమైన ముఖాల జాబితాలో ఈ అమ్మడు టాప్ లో నిలిచింది. 2020 బెస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ గా రికార్డులకెక్కింది.

మోడలింగ్ లో ఆరేళ్ల అనుభవం ఉన్న ఈ యంగ్ బ్యూటీ థైలేన్ బ్లాన్ డ్యూ విజేతగా నిలిచింది. ఈ గెలుపు తరువాత యాయెల్ షెల్బియాకు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. అయితే ఈ అందాల మోడల్ శ్రీమతి అన్న సంగతి ఆ తర్వాత వైరల్ అయ్యింది.  షెల్బియా ‘అందమైన’ ముఖంపైనా కొన్నిసార్లు ట్రోలింగ్ తప్పలేదు.  #అగ్లీ క్వీన్ అంటూ తనను ట్రోల్ చేయడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు. అన్నిటినీ అధిగమించి అత్యంత అందమైన 100 ముఖాల్లో అగ్రస్థానంలో నిలిచినందుకు తనకు సహాయం చేసిన వారందరికీ యాయెల్ షెల్బియా కృతజ్ఞతలు తెలిపారు.

తాను ఈ పోటీలో పాల్గొంటున్నానని తనకు తెలియదని.. విజయం తనకు ఆశ్చర్యం కలిగించిందని షెల్బియా చెప్పింది. షెల్బియా ఇప్పటికే కిమ్ కర్దాషియాన్ KKW బ్యూటీ ..  కైల్ జెన్నర్ చర్మ సంరక్షణా శ్రేణికి అంబాసిడర్ గానూ వర్క్ చేస్తోంది.